Samantha : ఇంకొక ఐటెమ్ సాంగ్ కి సంతకం పెట్టిన సమంత, ఈ సారి ఊ అంటావా ని మించిన రచ్చ ?
Samantha : ఇప్పుడు ప్రతి సినిమాలో ఐటెం సాంగ్ కామన్‌గా మారింది. స్పెషల్ సాంగ్‌కి ఉన్న క్రేజ్ దృష్ట్యా స్టార్ హీరోయిన్ కూడా స్పెషల్ సాంగ్‌కి సై అంటున్నారు. కాజల్ అగర్వాల్,తమన్నా, సమంత వంటి హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్‌లో సత్తా చాటారు. రీసెంట్‌గా సమంత పుష్ప సినిమాలో ఊ అంటావా సాంగ్ తో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊ అంటావా మావ ఊ ఊ అంటావా? అనే పాట అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది.అలా సమంత పేరు మరోమారు జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది. అయితే ఈ సాంగ్ షూట్ సమయంలోనే కొన్ని లీకులు వచ్చాయి.
సమంత ఈ ఐటం సాంగ్ కోసం దాదాపు ఐదు కోట్లు తీసుకుందని సమాచారం.ఇదిలా ఉంటే సమంత ఇప్పుడు మరో ఐటెం సాంగ్‌కి సై అన్నట్టు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అనన్య పాండే కథానాయికగా నటించగా, ఇందులో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ భామని తీసుకున్నట్టు ముందు వార్తలు వచ్చాయి. ఇప్పుడు సమంత పేరుని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.పూరీ సినిమాలో ఐటెం సాంగ్ అంటే ఓ రేంజ్‌లో ఉంటుంది. మరి పూరీ .. సమంతని తీసుకుంటున్నాడని వస్తున్న వార్తలలో నిజమెంత ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది.

samantha dance in another item song
Samantha : మరో ఐటెం సాంగ్‌లో..
పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెకుతున్న లైగర్ మూవీని పూరీ కంటెంట్స్ బ్యానర్ తో పాటు ధర్మ ప్రోడక్షన్స్ కలిపి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో దాదాపు ఐదు భాషల్లో లైగర్ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ కోసం భారీ బడ్జెట్ ను కేటాయించారు. దాంతో పాటు విజయ్ దేవరకొండ కు కూడా భారీగానే రెమ్యూనరేషన్ ముట్టు జెప్పినట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ రూ.30 కోట్ల రూపాయలు అందుకున్నాడని టాక్.