Samantha : ఆ వర్కవుట్స్ చేయడం వల్లే కాదు, ఆహారపు అలవాట్లు కూడా సమంతకి ఎఫెక్ట్ అయ్యాయా..!
Samantha : అందాల ముద్దుగుమ్మ సమంత కొద్ది రోజుల క్రితం తాను మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తరచుగా మోటివేషనల్ కొటేషన్లు, పెట్ ఫొటోలు, పర్సనల్ విషయాలను సామాజికి మాధ్యమం ద్వారా వెల్లడించే సామ్ ఇలాంటి వార్త చెప్పే సరికి ప్రతి ఒక్కరు నిర్ఘాంతపోయారు. సమంతం తను బాధపడుతున్న అటోఇమ్యునల్ వ్యాధి మయోసిటిస్ గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరచింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. పలువురు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. మయోసైటిస్ సాధారణంగా 15 ఏళ్ళ లోపు పిల్లలకు లేదా 45 ఏళ్ళు పైబడిన వాళ్లకు మాత్రమే సోకుతుంది.
యుక్త వయసులో ఉన్న సమంత మాయోసైటిస్ బారినపడడం ఎవరూ నమ్మలేకుకున్నారు. అదే సమయంలో ఈ మధ్య కెరీర్ పరంగా, పెర్సనల్ గా లైఫ్ లో సంభవించిన ఘటనలు కూడా కావచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఆమె అతిగా వ్యయామం చేయడం ఈ వ్యాధికి దారితీసింది అంటున్నారు. ది ఫ్యామిలీ మాన్ సిరీస్ కోసం సమంత హెవీ వర్క్ ఔట్స్ చేసి జీరో సైజ్ ప్యాక్ సాధించారు. అప్పటి నుండి ఆమె కఠిన వ్యాయామాలతో పర్ఫెక్ట్ అండ్ ఫిట్ బాడీ మారిటైం చేస్తున్నారు. ఈ క్రమంలో కండరాలపై ఒత్తిడి పెరిగి ఈ సమస్య ఏర్పడి ఉండవచ్చు అనే వాదన ఉంది
Samantha : ఫుడ్ కూడా కారణమా?
మరోవైపు పిజ్జాలు, బర్గర్‌లు లాంటీ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నా కూడా దీని బారిన పడే అవకాశం ఉందని.. ఇక మయోసైటీస్ వచ్చిన తర్వాత ఈ జంక్ ఫుడ్ పూర్తిగా మానేస్తే మంచిదని.. అంటున్నారు నిపుణులు. ఆరోగ్యంపై ఎక్కువ జాగ్రత్తలు తీసుకునే సమంత జంక్ ఫుడ్ తీసుకుందా లేదా అనేది మాత్రం సస్పెన్స్. యశోద షూటింగ్ తర్వాత ఆమెకు ఈ వ్యాధి సోకి ఉండవచ్చు అని వరలక్ష్మీ శరత్ కుమార్ తెలిపింది . ఈ సమస్య నుండి యశోద బయటపడుతుంది. ఎందుకంటే ఆమె గొప్ప ఫైటర్, అంటూ వరలక్ష్మి చెప్పుకొచ్చారు. యశోద చిత్రం నవంబర్ 4న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది.