Samantha – Naga Chaitanya : సమంత- నాగ చైతన్యని కలిసి చూడబోతున్నామా.. ఇక ఆనందమే వేరు..!
Samantha – Naga Chaitanya: టాలీవుడ్ సెన్సేషన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన వారు ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సమంతకు గొప్ప లక్షణం ముక్కు సూటి తనం. ఎదుగుతున్న రోజుల్లోనే ఆమె హీరోల రెమ్యూనరేషన్స్ పై సంచలన కామెంట్స్ చేశారు. కెరీర్ పీక్స్ లో ఉండగా ఎవరూ ఇలాంటి వివాదాలలో ఇరుక్కోవాలని అనుకోరు. కాని వాటితోను సావాసం చేసింది సమంత. ఇక ఏ మాయ చేశావే సమయంలో నాగ చైతన్యతో ప్రేమలో పడ్డ సమంత తర్వాత పెళ్లి చేసుకొని గత ఏడాది విడాకులు ఇచ్చింది. అక్టోబర్ 2, 2021న జంట విడిపోగా, వీరిద్దరిని కలపాలని ఎంతో మంది ట్రై చేశారు.
Samantha – Naga Chaitanya : జరిగితే బాగుండు..
కాని ఇద్దరిలో కూడా ఎవరు పాజిటివ్‌గా ముందుకు వెళ్లకపోవడంతో విడాకులు ఖాయం అయ్యాయి. విడాకులు తీసుకున్న సమంత ప్రస్తుత వయసు 35 ఏళ్ళు. అంటే ఆమె వివాహం చేసుకుంటే వెంటనే చేసుకోవాలి. లేదంటే ఏజ్ బార్ అవుతుంది. కాగా సమంతకు ఇకపై వివాహం చేసుకునే ఆలోచన లేదట. సమంత పెళ్లి నుండి తప్పించుకోవడానికి గర్భాశయం తొలగించుకున్నారని కొన్ని మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. పెళ్లి, పిల్లలు వద్దని, జీవితాంతం ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఓ సంచలన న్యూస్ ఇటీవల చక్కర్లు కొట్టింది. అయితే అది పుకారే అని కొందరు ఫిక్స్ అయ్యారు.
ఏం మాయ చేసావే సినిమా టైంలోనే సమంత, నాగ చైతన్య చూపులు కలిసాయి. ఆ తర్వాత మీరు మాటలు కలిసి.. ఆ మాటలు స్నేహంగా ..ఆ స్నేహం ప్రేమగా ..ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లేలా చేసుకున్నారు.గోవాలో రెండు రోజుల పెళ్లి చేసుకొన్నారు. అయితే ఏ మాయ చేశావే చిత్రం ఇద్దరి జీవితంలో స్పెషల్ అని చెప్పాలి. ఇప్పుడు ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. ఇద్దరిలో చర్చలు కూడా జరిపారని, ఓకే అంటే త్వరలోనే సెట్స్ పైకి కూడా వెళుతుందని టాక్స్ వినిపిస్తున్నాయి.
ఈ వార్త విని చాలా మంది అభిమానులు తెగ సంతోషిస్తున్నారు.