Samantha : నాగ చైతన్య నుండి విడిపోయాక తాను ప‌డ్డ బాధ‌ల‌ను తెలియ‌జేస్తూ స‌మంత ఎమోష‌న‌ల్ పోస్ట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : నాగ చైతన్య నుండి విడిపోయాక తాను ప‌డ్డ బాధ‌ల‌ను తెలియ‌జేస్తూ స‌మంత ఎమోష‌న‌ల్ పోస్ట్

 Authored By sandeep | The Telugu News | Updated on :2 March 2022,6:05 pm

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైత‌న్య నుండి విడిపోయాక త‌న బాధ‌ల‌ను సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తూ వ‌స్తుంది. కారణం ఏదైనా, తప్పు ఎవరిదైనా ఒకరిపై మరొకరు కోపంగా ఉన్నారు. నాగ చైతన్య ఎటువంటి ఎమోషన్ షేర్ చేయలేదు. సమంత మాత్రం పరోక్షంగా ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.   తనకు అన్యాయం జరిగినట్లు ఆమె ఆవేదన చెందుతున్నారు. విడాకుల ప్రకటన నాటి నుండి సమంత   నాగ చైతన్య పై సోషల్ మీడియా దాడి ఆపడం లేదనిపిస్తుంది. నిఘాడమైన ఆమె కోట్స్, కామెంట్స్ చూస్తే ..ఈ విషయం అర్థమవుతుంది. మరో వైపు నాగ్ ఫ్యామిలీ పూర్తిగా సైలెంట్. సమంతను వారు నిందించకపోగా, మంచి.. అమ్మాయిగా కుటుంబంలో ఆనందం పంచారని నాగార్జున తెలియజేశారు….

స‌మంత మాత్రం విడాకుల త‌ర్వాత తాను ప‌డ్డ బాధ‌ల‌ను వివ‌రిస్తూ వ‌స్తూనే ఉంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ‘అత్యంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాను’ అంటూ ఆవేదన చెందింది.2022 నుండి తనకు జీవితంపై పెద్దగా ‘అంచనాలేవీ’ లేవని, నాలుగేళ్లుగా తన భర్త నాగ చైతన్యతో ఇటీవల విడిపోయిన విషయాన్ని గుర్తుచేసుకుంది. తాను తరచుగా ఎదుర్కొనే సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి ప్రస్తావించింది. విడిపోయిన నేపథ్యంలో తాను అనుభవించిన మానసిక బాధను పంచుకుంది.

samantha shares her feelings after divorce

samantha shares her feelings after divorce

Samantha : బాధ‌ను ఇలా తెలియ‌జేసింది..

”2021లో నా వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనతో నాకు ఎలాంటి అంచనాలు లేవు. ఎందుకంటే నేను జాగ్రత్తగా రూపొందించిన ప్రణాళికలన్నీ శిథిలమయ్యాయి. కాబట్టి నాకు ఎలాంటి అంచనాలు లేవు. భవిష్యత్తులో నా కోసం ఏదైతే భద్రంగా ఉంటుందో దానిని   స్వీకరిస్తాను” దానికోసం బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని సమంత తెలిపింది. విడాకుల డిప్రెషన్ నుండి బయటకు రావడానికి స్నేహితుల సహాయం తీసుకున్న సమంత ఫుల్ ఫోకస్ కెరీర్ పై   పెట్టారు. ఆమె వరుసగా కొత్త చిత్రాలు, సిరీస్లకు సైన్ చేస్తున్నారు. సమంత కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఆమె న‌టించిన శాకుంత‌లం చిత్రంతో పాటు త‌మిళ చిత్రం విడుద‌ల‌కి సిద్ధంగా ఉన్నాయి….

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది