Samantha : ఈ ఏడాది నాకు ఎంతో కష్టంగా ఉంటుంది.. సమంత పోస్ట్ వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : ఈ ఏడాది నాకు ఎంతో కష్టంగా ఉంటుంది.. సమంత పోస్ట్ వైరల్

 Authored By prabhas | The Telugu News | Updated on :16 April 2022,6:00 pm

Samantha : సమంత ప్రస్తుతం తన పని ఏదో తాను చూసుకుంటూ గడిపేస్తోంది. విడాకుల అనంతరం సమంత చర్యలు సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ టాపిక్ అవుతున్నాయి. సమంత చేసే పనుల మీద ఎక్కువగా నెగెటివ్ టాక్ వస్తోంది. ఇక సమంత వస్త్రాధారణ అయితే ఎప్పుడూ చర్చనీయాంశంగానే మారుతుంది. అయితే సమంత మాత్రం వీటన్నంటిని పట్టించుకోవడం లేదు. తన పని తాను అన్నట్టుగా వ్యవహరిస్తోంది.విడాకుల వ్యవహారం గురించి ఇప్పటికీ ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఎందుకు విడిపోయారు.. ఎందుకు మనస్పర్థలు వచ్చాయ్.. అసలు కారణాలు ఏంటి? అనేవి తెలియడం లేదు.

మొత్తానికి సమంత నాగ చైతన్యలు మాత్రం దూరమైపోయారు. ఒకరినొకరు చూసుకోకుండా.. పలకరించుకోకుండా.. విషెస్ కూడా చెప్పుకోకుండా ఉంటున్నారు. ఇక సమంత తన ప్రాజెక్టులతో బిజీగా ఉంటే.. నాగ చైతన్య సైతం తన సినిమాలతో బిజీగా గడిపేస్తున్నాడు.సమంత ఇప్పుడు వ్యాపారాలు, ప్రకటనలు, సినిమాలు అంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. తన సాకీ, ఏకమ్ లర్నింగ్ సెంటర్, ప్రకటనలు, సినిమాలతో సమంత బాగానే సంపాదిస్తోంది.

Samantha With junaid Shaik workouts

Samantha With junaid Shaik workouts

అయితే ఇన్ని పనుల మధ్య సమంత తన పెట్స్‌తోనూ ఎంతో సమయాన్ని గడుపుతోంది. ఇక వర్కవుట్లకు కూడా సరైన సమయాన్ని కేటాయిస్తోంది. తాజాగా తాను వర్కవుట్లు చేస్తోన్న వీడియోను షేర్ చేస్తూ ఆసక్తికరమైన కామెంట్లు చేసింది.స్ట్రాంగ్ బాడీ ఉంటేనే.. స్ట్రాంగ్ మైండ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. తనకు ఈ ఏడాది ఫిజికల్‌గా ఎంతో సవాల్‌తో కూడుకునేలా ఉంటుంది.. ఎంతో కష్టంగా ఉంటుందన్నట్టుగా చెప్పుకొచ్చింది. అందుకే ఇలా తనను తాను స్ట్రాంగ్‌గా చేసుకునేందుకు కష్టపడుతున్నట్టుగా తెలిపింది

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది