Bigg Boss 5 Telugu : కన్నీళ్లు పెట్టుకున్న సిరి.. సరయు ఆ మాట అనడంతో..
Bigg Boss 5 Telugu బిగ్‌బాస్ తెలుగు సీజన్-5 స్టార్ట్ అయినప్పటి నుంచి బాగానే ఎంటర్ టైన్ చేస్తోంది. ఇక బిగ్ బాస్ అంటేనే గొడవలుచాలా కామన్. షో ప్రారంభమైన రెండో రోజు నుంచే హౌస్‌లో చాలా రకాల గొడవలు మొదలయ్యాయి. స్టార్ట్ అయిన ఒక్కరోజు మాత్రమే సభ్యులు అందరూ కూడా కలిసి కట్టుగా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం గ్రూపులుగా విడిపోయారనే చెప్పాలి. ఇక వీరంతా కూడా చిన్న చిన్న సమస్యలతోనే గొడవలు పడుతున్నారు. ఒకానొక […]
Bigg Boss 5 Telugu బిగ్‌బాస్ తెలుగు సీజన్-5 స్టార్ట్ అయినప్పటి నుంచి బాగానే ఎంటర్ టైన్ చేస్తోంది. ఇక బిగ్ బాస్ అంటేనే గొడవలుచాలా కామన్. షో ప్రారంభమైన రెండో రోజు నుంచే హౌస్‌లో చాలా రకాల గొడవలు మొదలయ్యాయి. స్టార్ట్ అయిన ఒక్కరోజు మాత్రమే సభ్యులు అందరూ కూడా కలిసి కట్టుగా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం గ్రూపులుగా విడిపోయారనే చెప్పాలి. ఇక వీరంతా కూడా చిన్న చిన్న సమస్యలతోనే గొడవలు పడుతున్నారు.
ఒకానొక సమయంలో వీరి గొడవలు తారాస్థాయికి కూడా చేరుతున్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బిగ్‌బాస్ వీరి మధ్య చిచ్చు పెట్టకముందే తమంతట తామే ఇలా గొడవలు పెట్టుకోవడం పరిపాటిగా మారిపోయింది.ఇక ఈ రోజు వచ్చిన ప్రోమో చూస్తుంటే ఆ గొడవలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ప్రోమోలో కొన్ని ఎమోషన్లు కూడా ఉన్నాయి. కాగా ఇందులో ఎవరితో సెట్, ఎవరితో కట్ అనే కాన్సెప్ట్‌ను నాగార్జున తెరమీదకు తీసుకువచ్చారు. ఇక ఇందులో ఒక్కొక్కరు ఒక్కక్కరిని సెట్ చేసుకుని కొందరిని కట్ చేశారు.
ఇక ఇలా కట్ చేసే వారి ఫొటోలను చింపేసి చెత్త డబ్బాలో కూడా వేశారు. అయితే 7 ఆర్ట్స్ సరయు మాత్రం యూ ట్యూబర్ సిరిని కట్ చేస్తున్నట్టు చెప్పడం.. ఇక ఎవరి సపోర్టు లేకుండా ఆడటం చాలా కష్టం అని తన సపోర్టు లేకుండా ఆడి గెలవాలని సవాల్ విసిరింది. ఇక దీనిపై సిరికూడా చాలా ఎమోషనల్ అయి ఏకంగా ఏడ్చేసింది. తాను ఎప్పుడైనా సపోర్టు చేయమని అడిగానా అంటూ సరయును అడుగుతూ కన్నీళ్లు పెట్టుకుంది. మరి పూర్తి వివరాలు తెలియాంటే వేచి చూడాల్సిందే.
Housemates lo miru evaritho Set avtharu, evarini Cut chestaru?#BiggBossTelugu5 today at 9 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/Vo4aJG2ZAi
— starmaa (@StarMaa) September 11, 2021