Sekhar master : సందు దొరికితే వదలడం లేదుగా.. శ్రీదేవీతో శేఖర్ మాస్టర్ రొమాన్స్
Sekhar master : బుల్లితెరపై శేఖర్ మాస్టర్ చేసే రచ్చ ఏ మేరకు వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. వెండితెరపై హీరోలకు, హీరోయిన్లు స్టెప్పులను కంపోజ్ చేసే శేఖర్ మాస్టర్.. ఇప్పుడు బుల్లితెరపై రచ్చ చేస్తున్నాడు. పలు షోల్లో జడ్జ్‌గా ఉంటూ కామెడీ టైమింగ్‌లో రాటు దేలిపోయాడు. అయితే సందర్భానుసారంగా బుల్లితెరపై చేసే రొమాంటిక్ పర్ఫామెన్స్‌లు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఓ పర్పామెన్స్ ఇచ్చాడు శేఖర్ మాస్టర్.
మామూలుగా అయితే ఢీ షోలో పూర్ణ, ప్రియమణి, పండుగలకు వచ్చే స్పెషల్ ఈవెంట్లలో రోజాతో శేఖర్ మాస్టర్ రచ్చ చేస్తుంటారు. ఇక బుల్లితెరపై ఒకప్పటి హీరోయిన్లతో శేఖర్ మాస్టర్ చేసే రొమాంటిక్ పర్ఫామెన్స్‌కు అందరూ ఫిదా అవుతుంటారు. తాజాగా శేఖర్ మాస్టర్ కామెడీ స్టార్స్ అనే షోలో జడ్జ్‌గా ఉన్నాడు. ఆయనతో పాటు నాటి హీరోయిన్ శ్రీదేవి కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహిరిస్తోంది.

Sekhar master SRidevi Romance Im Comedy Stars
Sekhar master : శ్రీదేవీతో శేఖర్ మాస్టర్ రొమాన్స్
అయితే ప్రతీ వారం శ్రీదేవీతో ఓ రొమాంటిక్ పర్ఫామెన్స్ చేస్తున్నాడు శేఖర్ మాస్టర్. ఈ సారి ఏకంగా ఉప్పెన సినిమాలోని జలజల పాతం అనే పాటకు డ్యాన్స్ చేశారు. ఇందులో అదిరిపోయే సెటప్ వేసుకుని సినిమా ఫీల్‌ను మిస్ చేయకుండా శ్రీదేవితో ఆడి పాడాడు శేఖర్ మాస్టర్. ఈ మేరకు వదిలిన ప్రోమో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఆదివారం ప్రసారం కానున్న ఈ షోలో రవి, లాస్యలు హైలెట్ అయ్యేలా ఉన్నారు.
Ee Aadivaram Non-Stop Entertainment!
Watch #ComedyStars on Sunday at 1:30 PM on Star Maa #SundayFunday pic.twitter.com/UEVMs4Q0qa— starmaa (@StarMaa) March 12, 2021