Robot 3 Movie – Dil Raju : బిగ్ బ్రేకింగ్ : దిల్ రాజు ప్రొడ్యూసర్ గా శంకర్ రోబో ౩ సినిమా !
Robot 3 Movie – Dil Raju : తెలుగు చలనచిత్ర రంగంలో డిస్ట్రిబ్యూటర్ గా ప్రయాణం స్టార్ట్ చేసిన దిల్ రాజు ప్రజెంట్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ నిర్మాతగా ఎదిగారు. సినిమా నిర్మాణరంగంలో ప్రారంభంలో.. చాలా క్లాస్ సబ్జెక్ట్స్ ఎంచుకున్నారు. కుటుంబ ప్రేక్షకులను, యూత్ నీ టార్గెట్ చేసుకొని సినిమాలు నిర్మించటం జరిగింది. ఆ తర్వాత కమర్షియల్ సినిమాలు వరుస పెట్టి చేసి.. పెద్దపెద్ద హీరోలతో కూడా అవకాశాలు అందుకుని తిరుగులేని విజయాలు దిల్ రాజు సొంతం చేసుకున్నారు.
ఒక తెలుగులో మాత్రమే కాదు హిందీలో ఇంకా తమిళంలో కూడా సినిమాలు నిర్మిస్తున్నారు. ఇక తాజాగా దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా “గేమ్ చేంజర్” అనే సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లో అడుగు పెట్టడం జరిగింది. శంకర్ తో ఇప్పటివరకు ఏ తెలుగు నిర్మాత సినిమా నిర్మించలేదు. ఇదిలా ఉంటే ఇక రాబోయే రోజుల్లో గ్రాఫిక్స్ సినిమాలపై అవగాహన ఉండేవిధంగా.. పూర్తిగా అటువంటి సబ్జెక్టు లను నిర్మించాలని దిల్ రాజు డిసైడ్ అయ్యారంట.
మరో రెండేళ్ల పాటు గ్రాఫిక్స్ విజువలు సినిమాలు చేయాలని దిల్ రాజు డిసైడ్ అయ్యారట. దీంతో టెక్నికల్ సినిమాల పట్ల నాలెడ్జ్ అవసరం అని కొత్త ప్రయాణం మొదలు పెట్టాలని దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అని టాక్. అందువల్లే సమంత “శాకుంతలం” సినిమాకి భాగస్వామి కావటం జరిగిందంట. సో త్వరలో శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా “రోబో 3” చిత్రాన్ని పూర్తిగా దిల్ రాజు నిర్మించనున్నట్లు.. అందుకు తగ్గ అవగాహన ఈ లోపు చిన్న చిన్న గ్రాఫిక్ ప్రాజెక్టులపై పెట్టుకుని పెడుతూ.. పెంచుకుంటున్నట్లు సమాచారం.