Shanmuk : షణ్ముక్‌తో మళ్లీ అవే ముచ్చట్లు.. సన్నీపై సిరి ఫైర్..
Shanmuk : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే ఫైనల్‌గా బిగ్ బాస్ టైటిల్ ఎవరు గెలుచుకోబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. షణ్ముక్ జస్వంత్, సన్నీ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ విషయమై నెటిజన్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు కూడా.హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ మళ్లీ పాత టాస్కులనిచ్చాడు. ఇకపోతే సిరి-షణ్ముక్ మధ్య ఫ్రెండ్లీ హగ్స్ ప్లస్ డిస్కషన్ మళ్లీ రొటీనే అయిపోయింది. ఇద్దరు అలా వేరే ప్రపంచంలోకి వెళ్లిపోయి మళ్లీ బిగ్ బాస్ వరల్డ్ లోకి వెనక్కు వస్తున్నారు.
Shanmuk : మళ్లీ పాత టాస్కులిచ్చిన బిగ్ బాస్..
ఇక సిరితో షణ్ముక్ పులిహోర మచ్చుట్లు కొనసా..గుతూనే ఉన్నాయి. తనకు పడిపోయావని షణ్ముక్ తాజాగా సిరికి చెప్పాడు. ఇక సిరి కూడా ఫ్రెండ్ అని అంటూనే.. షణ్ముక్ ఒడిలో తల పెట్టుకుని మరీ పడుకుంది.ఇక బిగ్ బాస్.. కంటెస్టెంట్స్ మళ్లీ పాత టాస్కులిచ్చాడు. బెలూన్స్‌లో ఎయిర్ ఫిల్ చేస్తుండగా వాటిని పగిలపోకుండా చూడాలనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్కులో మానస్, షణ్ముక్ టఫ్ కాంపీటిషన్ ఇచ్చారు. ఇక ఈ గేమ్‌లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచి షణ్ముక్ జస్వంత్ బిర్యానీ గెలుచుకున్నాడు.
ఇక రకరకాల శబ్దాలు చేస్తుండగా వాటిని గుర్తించే క్రమంలో సిరి తప్పుగా ఒక శబ్దాన్ని గుర్తించింది. ఇకపోతే ఈ గేమ్‌ను చాలెంజ్‌గా తీసుకుని శ్రీరామ్ పూర్తి చేశాడు. ఐదో టాస్కు.. తాళ్లను ఎక్కువ సేపు ఆపకుండా కదపాల్సి ఉండాల్సిన టాస్కులో సిరి, షణ్ముక్, సన్నీ పార్టిసిపేట్ చేశారు. ఇక గేమ్‌లో సన్నీ సిరిని సరదాగా కాసేపు ఆటపట్టించాడు. ఓడిపోయావ్ కదా.. మళ్లీ ఆడుదాం అని ఆటపట్టించాడు. అయితే, ఓడిపోయావ్ అనే మాట విని సిరి బాగా హర్ట్ అయింది. తనను అన్నం తినేందుకు పిలిచినప్పటికీ ఆమె రాలేదు. ఈ వారం ఎవరు హౌజ్ నుంచి ఎలిమినేట్ అవుతారనే టెన్షన్ అయితే కంటెస్టెంట్స్‌లో కనబడుతోంది.