Shanmuk : మరింత రెచ్చిపోయిన షణ్ముక్.. సిరిని ఏకంగా పెళ్లాం అంటూ.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shanmuk : మరింత రెచ్చిపోయిన షణ్ముక్.. సిరిని ఏకంగా పెళ్లాం అంటూ..

 Authored By mallesh | The Telugu News | Updated on :17 December 2021,1:40 pm

Shanmuk : బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో.. హౌస్‌లో ప్రస్తుతం టైటిల్ పోరు కొనసాగుతోంది. ఇదే క్రమంలో మొదటి నుంచి కాంట్రవర్సీనీ ఎదుర్కొంటున్న సిరి, షణ్ముక్.. చాలా సార్లు తమ హద్దులు దాటి ప్రవర్తించారు. ఎప్పుడు అదే పనిగా హగ్గులు, ముద్దులతో పబ్బం గడుపుకుంటున్నారు. దీనికి మాత్రం ఫ్రెండ్ షిప్ అని ఓ ట్యాగ్ తగిలించుకుని పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. ఈ విషయంపై హౌస్ లోనే కాకుండా, బయట సైతం పెద్ద చర్చే నడుస్తోంది. కానీ వీరిద్దరూ వాటిని పట్టించుకోవడం లేదు. తాజాగా గురువారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్‌లో షణ్ముక్ సిరిని.

Shanmuk  షణ్ముక్ మాటకు సిరి షాక్..

shanmuk says that siri is his wife

shanmuk says that siri is his wife

ఏకంగా తన పెళ్లాం అంటూ సంబోధించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది..అయితే షణ్ముక్‌ను సిరి లవ్ చేస్తున్నట్టు తనతో చెప్పిందని గతంలో యాంకర్ రవి ఓపెన్ గానే చెప్పాడుగురువారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్‌లో షణ్ముక్, సిరి వారి ఆట మొదలుపెట్టారు. సోఫాలో కూర్చని బిగ్ బాస్ ను ఇమిటేట్ చేశాడు షణ్ముక్. బిగ్ బాస్ కోరిక మేరకు పెళ్లాం మాదిరిగా సిరి కాఫీ ఇవ్వకండంటూ మాట్లాడాడు షణ్మక్.. షణ్ముక్ పెళ్లాం అంటూ సంభోదించడంతో సిరి కాస్త సిగ్గు పడుతూ..

మీకు అలా అనిపిస్తుందా సార్ అంటూ అడిగింది.అనంతరం నా ఫొటోలు ఎందుకు పెట్టావ్ అంటూ సిరిని ప్రశ్నించాడు షణ్ముక్. ఇందుకు సిరి బదులిస్తూ.. నా ఇష్టం.. మన ఇద్దరి ఫొటోస్ పెట్టా. అమ్మది, నీది కూడా పెట్టాను అని చెప్పింది. అనంతరం సిరిపైన వాయిస్ పెంచాడు షణ్ముక్. దీంతో అరుస్తున్నావ్ అంటూ సిరి అడగడంతో నీపై కాకుంటే మరెవరిపై అరవాలి అని అన్నాడు షణ్ముక్. అనంతరం సిరి ఓళ్లో పడుకుని కన్విన్స్ చేసినట్టు మాట్లాడాడు. నీకు బిగ్ బాస్ టైటిల్ వస్తే నేను తట్టుకోలేని షణ్ముక్ అనడంతో షాక్ అయింది సిరి. కానీ టైటిల్ నీకే రావాలని నేను కోరుకుంటున్న అని చెప్పింది సిరి.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది