Bigg Boss 5 Telugu : ఇకనైనా మారతారా?.. సిరి, షన్నులకు మొట్టికాయలు!
Bigg Boss 5 Telugu : సిరి, షన్నులు చేస్తోన్న వ్యవహారం, నడుపుతున్న కథలకు ఇంట్లో వాళ్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. వారి ట్రాక్ మీద ఎలాంటి క్లారిటీ లేకపోవడం, హద్దులు దాటుతుండటంతో సిరి, షన్నుల పేరెంట్స్ కూడా హర్ట్ అయినట్టు కనిపిస్తోంది.అందుకే సిరి వాళ్ల అమ్మ అయితే నేరుగా అనేసింది. మీ హగ్గులు నాకు నచ్చడం లేదని మొహం మీదే చెప్పేసింది.
అంతే కాకుండా వారిద్దరి రిలేషన్‌కు తండ్రి, ఫ్రెండ్, అన్న అంటూ ఓ లేబుల్ ఇచ్చే ప్రయత్నం చేసింది సిరి మదర్. కానీ సిరి మాత్రం తల్లి మాటలను అస్సలు పట్టించుకోలేదు. క్షణంలోనే అన్ని మరిచి.. షన్ను మీద పడిపోయింది. సిరి ఆపుకోలేకపోతోన్నట్టు కనిపిస్తోంది. ఇక షన్ను తల్లి కూడా ఇలాంటి సూచనలే పరోక్షంగా ఇచ్చింది. ఒక్కరితోనే కాదు అందరితో ఉండాలని షన్నుకి హింట్ ఇచ్చింది.

Shannu Mother Warns Siri And Shannu In Bigg Boss 5 Telugu
Bigg Boss 5 Telugu : సిరి, షన్ను రొమాన్స్ తగ్గిస్తారా?
అందరితో ఉండాలి.. ఒక్కరితోనే మూలకు వెళ్లి ఉండటం ఏంటి?. ఒకరు అలిగారనినువ్వెళ్లి ఎమోషనల్ ఎందుకు అవ్వడం నా కొడుకు స్ట్రాంగ్ అని అనుకున్నాను.. ఇలా ఎందుకు చేస్తున్నావ్.. ఎవరి ఆట వాళ్లు ఆడుకోవాలని సూచించింది. ఆటను ఆటలా చూడండి.. ఎమోషనల్ అవ్వకండి.. అంటూ సిరి, షన్నులకు ఇద్దరికి గడ్డి పెట్టేసింది. ఇకపై కొత్త సిరి, షన్నులను చూస్తారు అని అన్నారు. మరి మారుతారో లేదో చూడాలి.