Shyam Singha Roy : అదీ కృతిశెట్టి లెక్క.. అందుకే నానికి లిప్ లాక్.. !
Shyam Singha Roy : ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది కృతిశెట్టి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘ఉప్పెన’ ఫిల్మ్‌లో హీరోయిన్‌గా నటించిన కృతిశెట్టి.. ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఇకపోతే ఈ భామ నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ పిక్చర్ ఈ నెల 24న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. కాగా, ఈ చిత్రంలో నానికి కృతిశెట్టి లిప్ లాక్ ఇచ్చిన విషయం ట్రైలర్‌లో రివీల్ అయింది. దాంతో రెండో సినిమాకే కృతి ఇంత రెచ్చిపోవాలా అని కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
కృతిశెట్టి నానికి లిప్ లాక్ ఇవ్వడానికి ఓ కారణముందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్‌కు ‘ఉప్పెన’ పిక్చర్‌లో లిప్ లాక్ ఇస్తుంది. ఆ సమయంలో కృతిశెట్టి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ సినిమాకు బాగా అడ్వాంటేజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే సెంటిమెంట్ ప్రకారం.. ‘శ్యామ్ సింగ రాయ్’ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ చెప్పిన లిప్ లాక్ సీన్‌కు కృతిశెట్టి ఒప్పేసుకుందని టాక్. మొత్తంగా రెండో సినిమాకు హద్దులు చెరిపేసింది కృతి అనే కామెంట్స్ ప్రజెంట్ నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

shyam singha roy for that reason only Krithi Shetti theit said ok for scene in the film
Shyam Singha Roy : లెక్క ప్రకారమే కృతిశెట్టి లిప్ లాక్.. !
‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రంలో కృతిశెట్టితో పాటు హీరోయిన్స్‌గా సాయిపల్లవి, మడోనా సెబాస్టియన్ నటించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఈ చిత్రం కోల్ కత్తా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కగా, నాని ‘వాసు, శ్యామ్ సింగ రాయ్’ రెండు పాత్రలను పోషించారు. ఈ చిత్రంలో రెండు పాటలను దివంగత లిరిసిస్ట్ పద్మ శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించారు. ఈ చిత్రం హిందీ భాష మినహా మిగతా సౌతిండియా లాంగ్వేజెస్ అన్నిటిలో విడుదల కాబోతున్నది.