Singer Revanth : బ్యాచిలర్ లైఫ్ కు ముగింపు పలికిన ప్రముఖ సింగర్.. వైరల్ అవుతోన్న రేవంత్ నిశ్చితార్థం ఫోటోలు..!
Singer Revanth : ఇండియన్ ఐడల్ విజేత, టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ రేవంత్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పబోతున్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సింగర్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో అధికారంగా ప్రకటించారు. గుంటూరులో లో నిన్న రేవంత్ ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది.కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్ధాన్ని ఘనంగా నిర్వహించగా..
రేవంత్ ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇవి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. రేవంత్ నిశ్చితార్థం విషయం తెలిసి పలువురు నెటిజన్లతో పాటు ప్రముఖ సెలబ్రిటీలు, అతని అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు. పెళ్లి కూతురు పేరు అన్విత అని తెలుపగా..

Singer Revanth engagement pics went in viral
ఆమె గురించిన పూర్తి వివరాలు మాత్రం రేవంత్ ఎక్కడ చెప్పకపోగా.. త్వరలోనే ఆమె గురించి ఏవో ఆసక్తికరమైన విషయాలను చెప్తానని అంటున్నాడు.18 ఏళ్ల వయసులోనే 2008 లో సింగర్ గా తన ప్రస్థానం మొదలు పెట్టిన రేవంత్.. టాలీవుడ్ లో కీరవాణి, మణిశర్మ వద్ద ఎక్కువ పాటలు పాడి మంచి సింగర్ గా పేరు సంపాదించాడు. రేవంత్ ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 600కు పైగా పాటలు పాడినట్లు సమాచారం.