Geetu Royal : గీతూ పక్క‌న మ‌గాళ్లు పడుకున్నా ప్రాబ్ల‌మ్ లేద‌ట‌.. సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన రేవంత్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Geetu Royal : గీతూ పక్క‌న మ‌గాళ్లు పడుకున్నా ప్రాబ్ల‌మ్ లేద‌ట‌.. సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన రేవంత్

 Authored By sandeep | The Telugu News | Updated on :6 September 2022,3:30 pm

Geetu Royal : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం గ‌త కొద్ది సంవ‌త్స‌రాలుగా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి ఏడాది స‌రికొత్త షోతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహ‌కులు. తాజాగా సీజ‌న్ 6 గ్రాండ్‌గా లాంచ్ కాగా, ఈ సీజ‌న్‌లో మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక తొలి రోజు వీరి సంద‌డి మాములుగా లేదు. హౌజ్ లో ఇన‌య‌ సుల్తాన తన తండ్రి కలను నెరవేర్చేందుకు బిగ్ బాస్ ఇంటికి వచ్చానని, తన తండ్రి పేరుని తన పేరులో పెట్టుకున్నాను అని ఇనయ రెహ్మాన్ అంటూ చెబుతూ తెగ ఎమోషనల్ అయింది.

Geetu Royal : గీతూ ర‌చ్చ‌…

ఇక సింగర్ రేవంత్ మాత్రం అందరికీ టార్గెట్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ప్రతీ విషయంలో ప్రతీ కంటెస్టెంట్ల మధ్యలో దూరుతున్నాడట. ఏ ఇద్దరూ మాట్లాడుకున్నా కూడా వచ్చి ఏదో ఒకటి అనేస్తున్నాడట. ఇదే విషయంపై కీర్తి భట్, ఆరోహి ఫీల్ అయ్యాడు. ఇక గీతూ అయితే.. నేరుగా మొహం మీదే చెప్పేసింది. మేం మాట్లాడుతుంటే మధ్యలో ఎందుకు దూరుతున్నావ్ అని అడిగేసింది. అయితే గీతూ మాట్లాడిన మాట‌ల‌ను బ‌య‌ట‌కు వ‌చ్చి రేవంత్ చెప్ప‌గా, ఈ విష‌యం అంద‌రు నోరెళ్ల‌పెట్టేలా చేసాడు. గలాట గీతూ కాస్త నాటి కామెంట్లు చేసిందని చెప్పిన రేవంత్… వీటిని గార్డెన్ ఏరియాలో ఉన్న . తన టీంతో సరదాగా చెప్పుకొచ్చాడు.

Revanth revealed the secret geetu royal

Revanth revealed the secret geetu royal

ట్రాష్ టీంలో భాగంగా సుదీప, బాలాదిత్య, అభినయ, అర్జున్ కళ్యాణ్, రేవంత్ ఇలా అందరూ గార్డెన్ ఏరియాలో వచ్చి పడ్డట్టు కనిపిస్తోంది. అయితే సరదాగా ముచ్చట్లు పెడుతున్న సమయంలో రేవంత్ ఇలా బయట పెట్టేశాడు. రాత్రి గీతూ ఇలా అనేసిందంటూ చెప్పుకొచ్చాడు. నా పక్కన మగాళ్లు పడుకున్నా నాకేం ప్రాబ్లం లేదు.. కాకపోతే నిద్రలో చెవి కొరికేస్తాను అని చెప్పిందట. పక్కనే ఉన్న శ్రీహాన్ కౌంటర్ వేశాడు. చెవి ఒక్కటేనా? ఇంకేమైనా కొరుకుతావా? అని అన్నాడట. ఇలా రేవంత్ చెప్పడంతో అందరూ నవ్వేశారు. ఇక గ‌లాటా గీతూ మొద‌టి రోజు నుండి నోరు పారేసుకుంటుంది. అంద‌రితో త‌గాదాకు దిగుతున్న నేప‌థ్యంలో ఆమె హౌజ్ నుండి బ‌య‌ట‌కు వెళ్ల‌డం ప‌క్కా అని కొంద‌రు డిసైడ్ అయ్యారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది