Bigg Boss 5 Telugu : నీ కారెక్టర్ ఇదే.. పెద్ద రాడ్.. సిరి పరువు తీసిన షన్ను
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో సిరి, షన్ను ట్రాక్ ఎవ్వరికి ఓ పట్టాన అర్థం కాదు. చెప్పుకోవడం మాత్రం ఫ్రెండ్స్. కానీ కనిపించే విధానం మాత్రం అంతకు మించి అనేలా ఉంటుంది. బయట ఈ ఇద్దరికి జంట ఉంది. దీప్తి సునయనతో షన్ను రిలేషన్ షిప్‌లో ఉన్నాడు.. సిరి శ్రీహాన్ లవ్‌లోఉన్నారు. రేపో మాపో పెళ్లి చేసుకునేందుక సిద్దంగానే ఉన్నారు. కానీ సిరి, షన్నులు మాత్రం బిగ్ బాస్ ఇంట్లో హద్దులు దాటుతున్నట్టు అనిపిస్తుంది. నిన్నటి ఎపిసోడ్‌లో రొమాన్స్ జరిగింది. అలానే గొడవలు కూడా జరిగాయి.
టాస్కులో తన మీద అరిచాడని సిరి హర్ట్ అయింది. సిరి హర్ట్ అయింది కదా? అని షన్ను.. ఆమె కోసం గుంజిళ్లు తీశాడు. అందరి ముందు పదే పదే సారీ చెప్పాడు. అలా అర్దరాత్రి తన కోపం పోయింది. షన్నుకు గట్టిగా హగ్గులు ఇచ్చింది. అయితే మళ్లీ ఉదయం అయ్యే సరికి గొడవలు మొదలయ్యాయి. అవన్నీ టాస్కుల్లో భాగంగానే జరిగినా కూడా అంతకు మించి అని మనసులోకి తీసుకున్నారు. సిరి అందరి బట్టలు తీసి బెడ్రూంలో పడేసింది..
Bigg Boss 5 Telugu : సిరి షన్ను గొడవలు..
లో దుస్తులు కూడా అలా పడేశావ్ ఏంటి? అని సిరి మీద షన్ను ఫైర్ అయ్యాడు. అవన్నీ మళ్లీ సర్దు అంటూ సిరికి షన్ను ఆర్డర్ వేశాడు. నేను సర్దను అంటూ సిరి అనడంతో.. ఇదే నా కారెక్టర్ అని అవమానించాడు. దీంతో సిరి కన్నీరు పెట్టేసింది. అయితే ఆ తరువాత కాజల్‌తో షన్ను సిరి గురించి మాట్లాడాడు. ఆమె చాలా స్ట్రాంగ్.. బీభత్సమైన రాడ్.. నెక్ట్స్ నుంచి సిరిని నా వైపు ఉంచుకుంటాను.. వేరే టీంకు పంపించను అని సిరి గురించి షన్ను చెప్పేశాడు.