Deepthi Sunaina Shanmukh : షణ్ముఖ్ దీప్తి సునయన లవ్ మరీ అంత వీకా.. సిరి అంత మాట అనేసింది ఏంటి ?
Deepthi Sunaina Shanmukh : బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని షో బిగ్ బాస్. ఈ షోతో ఎంతో మంది పాపులారిటీ దక్కించుకున్నారు. ఇటీవల ముగిసిన సీజన్ 5 కార్యక్రమంలో సిరి అందరి దృష్టిని ఆకర్షించింది. బిగ్ బాస్ హౌస్‌లో షణ్ముక్ జశ్వంత్, సిరి హన్మంత్ చేసిన రచ్చ మామూలుగా లేదు. ఇద్దరు ముద్దులు, హగ్గులతో రెచ్చిపోవడం వంటి పనులు చేశారు. ఇది ఓ రకంగా షన్ను ఇమేజ్‌కు డ్యామేజ్‌ను కలిగిచింది. చివరకు షణ్ముక్‌తో అతని ప్రియురాలు దీప్తి సునయన కూడా బ్రేకప్ చెప్పేసింది. షన్ను, దీప్తి సునయన విడిపోవడం వెనుక సిరి హన్మకొండను నెటిజన్స్ ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు.
కేవలం సిరి – షణ్ను మధ్య హౌస్‌లో జరిగిన తంతుతోనే దీప్తి, షణ్నుకు దూరమైందన్నదే ఎక్కువ మంది నమ్ముతున్నారు. అయితే షణ్ముఖ్ కోసం దీప్తి మొదటి నుండి చాలా కష్టపడింది. షణ్ముఖ్ కష్టాలలో ఉన్నప్పుడు ఆయనకు ఆర్ధిక సాయం చేసింది. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు షణ్నుకు ఓట్లేయాలని బాగా క్యాంపెయిన్ చేసింది. అయితే షణ్ముఖ్ ప్రవర్తన నచ్చక దీప్తి ఇటీవల బ్రేకప్ చెప్పింది. దీంతో గత 20 రోజులుగా సిరి సోషల్ మీడియాలో విలన్ అయిపోయింది.ఈ చర్చపై తన ఇన్‌స్టా వేదికగా సిరి స్పందించింది. తన వల్ల వారు విడిపోయారనడం కరెక్ట్ కాదని… వాళ్ల లవ్ అంత వీకా అన్నట్టు కామెంట్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించిన సిరి .. దీప్తి – షణ్ను తన వల్ల విడిపోలేదని చెప్పింది.

siri hnamanth reacts on shanmukh and Deepthi Sunaina break up
Deepthi Sunaina Shanmukh : సిరి స్ట్రాంగ్ కామెంట్స్ వైరల్..
‘బిగ్ బాస్ హౌస్‌లో షణ్ముక్, జెస్సీ నాకు బెస్ట్ ఫ్రెండ్స్. తర్వాత రవి బ్రదర్‌లా ఉన్నారు. నా, షన్ను మధ్య ఉండేది కేవలం స్నేహం మాత్రమే. బయట ఉన్నప్పుడు వంద మంది ఎమోషన్స్‌ను చూస్తుంటాం. అదే బిగ్ బాస్ హౌస్‌లో అయితే 19 మంది ఎమోషన్స్ మాత్రమే మనకు కనిపిస్తాయి. ఎమోషనల్‌గా ఫీల్ కావడం అనేది సాధారణంగా జరుగుతుంది. అయితే నాకు, షన్నుకు మధ్య అది కాస్త ఎక్కువగా జరిగింది. నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ట్రోల్స్ చూసి కంప్లీట్‌గా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. తర్వాత కాస్త సెట్ అయ్యింది అని సిరి చెప్పుకొచ్చింది.