Bigg Boss 5 Telugu : ఇంత జరిగినా మారడం లేదు!.. ఒకే బెడ్డు మీద దొర్లిన సిరి షన్ను
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో షన్ను, సిరిల సంగతి ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం. ఇంట్లో మంది తక్కువ అవుతున్నారు.. ఇక ఇప్పుడు మన మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది.. జనాలు ఏం అనుకుంటారో.. మనం వేరే వేరే బెడ్డుల మీద పడుకుందామని షన్ను అంటాడు. ఆ మాటలకు సిరి కాస్త హర్ట్ అయినట్టుంది. గత వారం ఈ ఇద్దరూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బాత్రూంలోకి వెళ్లి కొట్టేసుకోవడం, తనను తాను గాయపర్చుకోవడంపై నాగార్జున కూడా సిరి మీద ఫైర్ అయ్యాడు.
మీరు చేసుకునే రొమాన్స్ మీద నేను ప్రశ్నించను అని పరోక్షంగా కౌంటర్లు వేశాడు. కానీ ఇలా నిన్ను నువ్ గాయపర్చుకోవడం తప్పు అని నాగార్జున కాస్త స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే మళ్లీ షన్ను సిరిలు అదే ట్రాక్ అదే పద్దతిని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇకపై జాగ్రత్తగా ఉంటామని చెబుతారు.. హగ్గులు కాస్త తగ్గించుకుంటే మంచిది అని వాళ్లు చెబుతారు. కానీ మళ్లీ అదే పని చేస్తారు. ఈ సీజన్లో సిరి ఇచ్చిన హగ్గులు, పెట్టిన ముద్దులు ఇంకెవ్వరు ఏ సీజన్‌లో కూడా పెట్టి ఉండరు.

Siri Hugs Shannu In Bigg Boss 5 Telugu 12th week
Bigg Boss 5 Telugu : హగ్గులతో సిరి, షన్ను రచ్చ..
నిన్న ఏదో గొడవ జరిగింది. మళ్లీ చివరకు సిరి, షన్నులు ఒక్కటయ్యారు. రాత్రి పూట షన్ను బెడ్డు మీదకు వచ్చి సిరి హగ్గు ఇచ్చింది. షన్ను బెడ్డు మీద ఇద్దరూ కలిసి పడుకున్నట్టు కనిపించింది. మొత్తానికి ఈ హగ్గుల గోల ఇంట్లో వాళ్లు కూడా తట్టుకోలేకపోతోన్నట్టు కనిపిస్తోంది. లోపల వీళ్ల రొమాన్స్ చూస్తుంటే బయట ఉన్న దీప్తి సునయన, శ్రీహాన్‌లు మాత్రం ఎటువంటి రియాక్షన్ ఇవ్వడం లేదు. ఇవన్నీ కామన్ అన్నట్టుగా లైట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది.