Bigg Boss 5 Telugu : రొమాన్స్ గురించి అమ్మ హింట్ ఇచ్చింది.. సిరి పెడచెవిన పెట్టింది
Bigg Boss 5 Telugu : కన్నతల్లే హగ్గులు ఇవ్వడం, ఆ పనులు నచ్చలేదు అని అందరూ చేసే ప్రోగ్రాంలో ఓపెన్‌గా చెప్పిందంటే.. విషయం ఎక్కడి వరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. సిరి షన్నుల వ్యవహారం మీద జనాలు ఎలాంటి ఓపినీయన్‌తో ఉన్నారో సిరి తన అమ్మ మాటలు బట్టి తెలుసుకోవచ్చు. తన పద్దతి మార్చుకోవచ్చు. కానీ సిరి మాత్రం అలా చేయడం లేదు. కన్నతల్లి చెప్పిన మాటలను పెడచెవిన పెడుతోంది.
హగ్గులు ఇచ్చుకోవడం నాకు నచ్చలేదు అని మొహం మీదే సిరికి తన అమ్మ చెప్పింది. దాన్ని ఓ సూచనగా తీసుకోకుండా తెగ ఫీలైంది. షన్ను, సిరిలు అమర ప్రేమికుల్లా ఫీలవుతున్నారో ఏంటో గానీ.. హగ్గులు ఇచ్చుకోకుండా మానడం లేదు. బయట వాళ్లిద్దరికి లవర్స్ ఉన్నారనే విషయాన్ని కూడా మరిచిపోయినట్టున్నారు. సిరి, షన్ను ట్రాక్ ఎటో వెళ్లిపోతుందని తెలిసిన అమ్మ.. మంచి సలహా ఇచ్చింది.

Siri Mother On Romance With Shannu In Bigg Boss House
Bigg Boss 5 Telugu : హింట్ ఇచ్చినా తీసుకోలేని సిరి
పదే పదే ఓ మాటను చెప్పింది. తండ్రిలా, అన్నలా, ఫ్రెండ్‌లా అని చెబుతుంటే సిరి మాత్రం అంగీకరించలేకపోయింది. అంటే షన్ను ఇంకా వేరే ఎమోషన్‌తో కనెక్ట్ అయ్యాడా? అనే అర్థం వచ్చేలా సిరి ప్రవర్తిస్తోంది. ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారా? అందుకే ఇలా చేస్తున్నారా? అని అనుకునేలా రచ్చ రచ్చ చేస్తున్నారు. అమ్మ మాట విని కాస్త పద్దతిగా, జాగ్రత్తగా ఉంటే.. టాప్ 5 వరకు సిరి వెళ్తుంది.