Bigg Boss 5 Telugu : ఎవ్వరేం అనుకున్నా పర్లేదు!.. బరితెగించిన సిరి
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో శనివారం నాడు రచ్చ రచ్చగా మారింది. ఎందుకలా చేస్తున్నావ్.. ఆ రొమాన్స్ ఏంటి.. ఆ ముద్దులేంటి? అని నేరుగా సిగ్గు విడిచి నాగార్జున కూడా అడగలేడు కాబట్టి కాస్త గడ్డిపెట్టాడు. కానీ సిరికి ఎలా అర్థమైంది ఏమో గానీ మొత్తానికి బరితెగించినట్టు అనిపిస్తోంది. ఎందుకలా ప్రవర్తిస్తున్నావ్ అని నాగార్జున అడిగాడు. ఇలాంటివి అందరి ముందు అడగలేం కాబట్టి.. కన్ఫెషన్ రూంలోకి తీసుకెళ్లాడు. అక్కడ అసలు విషయం రాబట్టాడు.
ఎందుకలా ప్రవర్తిస్తున్నావ్.. ఎందుకు నీది నువ్వే బాధపెట్టుకుంటున్నావ్.. సెల్ఫ్ హార్మ్ చేసుకుంటున్నావ్ అసలు ఏమైంది? అంటూ నాగార్జున అడిగాడు. దీంతో సిరి చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. బరితెగించిన దానిలా ప్రవర్తించింది. తప్పు అని తెలిసినా కూడా చేస్తున్నా.. బయట ఎవరు ఏం అనుకున్నా పర్లేదు అంటూ చెప్పుకొచ్చింది. నాక్కూడా ఎందుకు కనెక్షన్ మొదలైందో తెలియడం లేదు సర్. ఈఎమోషన్ ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు.

Siri Reveals Secret of Romance With Shannu In Bigg Boss 5 Telugu
ఎమోషన్ వచ్చింది.. నేను వెరీ ఎమోషనల్ పర్సన్. ఎవ్వరీన బాధపెట్టను. నన్ను ఎవ్వరు బాధపెట్టినా తిరిగి అనను.. నేను బాధపడతాను.. నా స్టోరీ ఏంటో నాకు తెలుసు. బయట అందరికీ తెలుసు. తప్పొప్పులు తెలియడం లేదు.. ఇలా చేయడం తప్పే అని తెలిసినా కూడా చేస్తున్నా.. బయటకు ఎలా వెళ్తుందో తెలియడం లేదు.. ఎవ్వరేం అనుకున్నా పర్లేదు అంటూ నాగార్జునకు తన పరిస్థితిని వివరించింది. ఒకరి గురించి ఆలోచించకు.. నీకు ఏం అనిపిస్తే అది చేసేయ్ అంటూ మరింత రెచ్చగొట్టేశాడు నాగార్జున.