Sitara : డ్యాన్స్ తో అదరగొట్టిన మ‌హేశ్ బాబు కూతురు సీతార‌ వైర‌ల్ వీడియో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sitara : డ్యాన్స్ తో అదరగొట్టిన మ‌హేశ్ బాబు కూతురు సీతార‌ వైర‌ల్ వీడియో..!

 Authored By mallesh | The Telugu News | Updated on :25 November 2021,12:40 pm

Sitara : తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఇతర భాషలకు చెందిన ఇండస్ట్రీలో సైతం గతం నుంచి యాక్టర్ల వారసులు ఇండస్ట్రీలోకి వస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ మొదలు అక్కినేని, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ.. ఇలా చాలా మంది ఫ్యామిలీస్ నుంచి వారి వారి వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలాంటి వారిలో కొందరు అడపా దడపా మూవీస్ చేస్తూ నిలుదొక్కుకునే ప్రయత్నం చేస్తుండగా..

Sitara : ఆక‌ట్టుకుంటున్న వీడియో..

కొందరు మాత్రం టాప్‌లో ఉండి లక్షల్లో ఫాలోవర్స్ ను సంపాదించుకుని చేతి నిండ సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నారు. ఇందులో ఎన్టీఆర్, రాంచరణ్ ఇప్పటికే ఆర్ఆర్ఆర్ లాంటి భారీ మూవీలో నటిస్తూ ఓ రేంజ్‌కు చేరుకున్నారు.ఇక ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కుమారుడు మహేశ్ బాబు.. చైల్డ్ ఆర్టిస్‌గా ఇండస్ట్రీకి పరిచయమై చాలా మూవీస్ లో యాక్ట్ చేశాడు. తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ మొదట్లో మూవీస్ విషయంలో కాస్త తడబడిగా.. ఆయనకు మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన మూవీ ఒక్కడు. ఆ తర్వాత అతడు, పోకిరి వంటి మూవీస్ మహేశ్ సినీ కేరీన్‌ను మలుపు తిప్పేశాయి.

దీంతో ఆయన టాప్ హీరోల్లో ఒకడిగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక తాజాగా మహేశ్ బాబు కుమార్తె సితార.. తన ఇన్‌స్టా లో ఓ వీడియో అప్‌లోడ్ చేసింది. ఇందులో ఆమె చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. దీన్ని చూసిన మహేశ్ ఫ్యాన్స్ ఆమెను పొగడకుండా ఉండలేక పోతున్నారు. ఆమెకు మంచి ఫ్యూచర్ ఉందంటూ కామెంట్స్ ఇస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియో చూసెయ్యండి.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది