Sitara : వెకేషన్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న సితార.. డ్యాన్స్‌తో కేక పెట్టించిందిగా..!
Sitara : మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు తన తండ్రి కన్నా చాలా ఫేమస్ అయింది.సితార పెన్నీ సాంగ్ ప్రమోషనల్ వీడియోలో చేసిన సంగతి మనందరికి తెలిసిందే. అప్పటి నుండి అందరి కళ్ళు సితార పైనే ఉన్నాయని అంటే అతిశయోక్తి కాదు. ఘట్టమనేని నటవారసురాలిగా, మహేష్ బాబు గారాల పట్టీ గా అదరగొడుతుంది. ఇక సితార ను హీరోయిన్ గా తీసుకొస్తారా..?లేక వేరే రంగంలో తీసుకెళ్తారా..? అనేది మహేష్ అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. దీనికి ఇటీవల సర్కారు వారి పాట ప్రమోషన్‌లో తెలిపారు మహేష్.
భవిష్యత్తులో సితార గొప్ప యాక్ట్రెస్ అవుతుంది” అని తెలిపారు. మహేష్ ఈ వ్యాఖ్యలు చేయడంతో.. ఇప్పుడు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ వారసురాలిగా సితార సినిమాల్లోకి ఎంట్రీ ఖాయం అని సంబరాలు చేసుకుంటున్నారు.నిత్యం ఏదో ఓ వార్తల్లో మహేష్ కూతురు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. స్టార్ కిడ్‌లో తన తండ్రిలా అందంగా ఉన్న ఆమె ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తాజాగా సితార ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సితార తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పింది. అంతేకాదు ఆమెతో టైం గడపాలంటే సితారకు ఎంతో ఇష్టం అంట. ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎవరనే కదా మీ డౌట్. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.

sitara fun in vacation
Sitara : సితార రచ్చ…
అవును సితారకు సమంత అంటే చాలా ఇష్టం అంట. నటి సమంతతో ప్రతి క్షణం గడపడం చాలా సంతోషంగా ఉందని చెబుతోంది సితార.బ్రహ్మోత్సవం షూటింగ్ సమయంలో సమయంలో తన తండ్రి మహేష్ బాబుతో కలిసి పనిచేస్తున్నప్పుడు సెట్స్‌లో సమంతతో సరదాగా గడిపానని సితార తెలిపింది. సమంతతో కలిసి ఉండడం నాకు ఇష్టం’ అని సితార చెప్పుకొచ్చింది. 5 నుంచి 6 ఏళ్ల క్రితం సెట్స్‌లో సరదాగా గడిపినప్పుడు సమంతతో గడిపిన మంచి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం చాలా సరదాగా అనిపించింది’ అని సితార చెప్పింది. ప్రస్తుతం ఈ చిన్నారి వెకేషన్ టూర్ లో ఉంది. అక్కడ తెగ సందడి చేస్తుంది. తాజాగా తనకు సంబంధించిన క్యూట్ వీడియో షేర్ చేసి మెస్మరైజ్ చేసింది.
View this post on Instagram