Sitara : ఏంజెల్‌లా క‌నిపిస్తున్న సితార‌.. ముద్దుముద్దుగా విషెస్ చెప్పిందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sitara : ఏంజెల్‌లా క‌నిపిస్తున్న సితార‌.. ముద్దుముద్దుగా విషెస్ చెప్పిందిగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :3 April 2022,8:20 am

Sitara: సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార ఘట్టమనేని తండ్రికి త‌గ్గ త‌న‌య అని అనిపించుకుంటుంది. చిన్నారికి నెట్టింట్లో వేరే లెవెల్ ఫాలోయింగ్ ఉంటుంది. మహేష్ బాబు తరువాత ఎక్కువగా సితారనే ఫ్యాన్స్ ఫాలో అవుతుంటారు. ఇక సితార, మహేష్ కలిసి చేసే అల్లరి మామూలుగా ఉండదు. అయితే కొన్ని రోజుల నుంచి సితార ఎక్కువగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ వచ్చింది. ఆనీ మాస్టర్ నేతృత్వంలో సితార డ్యాన్స్ నేర్చుకుంటూ వచ్చింది. ఇది క్యాజువ‌ల్‌గా నేర్చుకుంద‌ని అంద‌రు అనుకున్నారు. కాని సర్కారు వారి పాట నుంచి రాబోతోన్న సెకండ్ సింగిల్ పెన్నీ పాటలో సితార మెరిసింది. ఆమె వేసిన స్టెప్పులకు ఘట్టమనేని అభిమానులు మాత్రమే కాదు.

. సినీ ప్రేమికులంతా ఫిదా అవుతున్నారుసితార తెరపై కనిపించడం ఇదే మొదటి సారి కావ‌డంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. సితార‌ని రానున్న రోజుల‌లోవెండితెర‌పై చూసే ఛాన్స్ త‌ప్ప‌క వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే బన్నీ డాటర్ అల్లు అర్హ.. అంజలి పాటలో కనిపించి క్యూట్ ఎక్స్ ప్రెషెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత సమంతా లీడ్ రోల్ చేస్తోన్న శాకుంతలంలో నటించి బన్నీ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసింది. గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ప్రిన్స్ భరతగా అల్లు అర్హ నటించింది. ఇలానే సితార కూడా రానున్న రోజుల‌లో ర‌చ్చ చేయ‌నుంద‌ని అంటున్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు.

sitara looking angel in video Viral

sitara looking angel in video Viral

Sitara : సితార రచ్చ‌..

చాలా రోజుల తర్వాత మహేష్ బాబు మాస్ యాటిట్యూడ్ తో నటిస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఈ మూవీ. దీనితో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. మహేష్ కి జోడిగా ఈ మూవీలో కీర్తి సురేష్ నటిస్తోంది. సర్కారు వారి పాట చిత్రం నుంచి శనివారం విడుదలైన ‘పెన్నీ’ సాంగ్ ప్రోమో సెన్సేషనల్ గా మారింది. ఈ సాంగ్ లో మహేష్ బాబుతో కలసి సితార స్టెప్పులేయడం ఫ్యాన్స్ కి ఊహించని సర్ ప్రైజ్. పెన్నీ సాంగ్ పై సితార సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. సర్కారు వారి పాట లాంటి అమేజింగ్ టీం తో కలసి పనిచేసే ఛాన్స్ రావడం సంతోషంగా ఉందని సితార పోస్ట్ పెట్టింది. ‘నాన్న నిన్ను గర్వపడేలా చేస్తా’ అని కూడా సితార కామెంట్స్ చేసింది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది