Sitara : సితార త‌గ్గ‌ట్లేదుగా.. ఫొటోషూట్‌తో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sitara : సితార త‌గ్గ‌ట్లేదుగా.. ఫొటోషూట్‌తో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుందిగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :8 April 2022,12:00 pm

Sitara : మ‌హేష్ గారాల ప‌ట్టి సితార తండ్రికి త‌గ్గ త‌న‌య అనిపించుకుంది. చిన్నతనం నుంచే ఎంతో యాక్టివ్‌గా ఉంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్, ఫాలోయింగ్ కూడగట్టుకుంది ఈ స్టార్ కిడ్. అతి చిన్న వయసులోనే తన ఆట పాట, చలాకీతనంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు తన సింగింగ్, డాన్సింగ్ టాలెంట్‌ని నెటిజన్లతో పంచుకోవడం సితార నైజం. తన గారాలపట్టి సితార డాన్స్ వీడియోను షేర్ చేస్తూ అమితమైన ప్రేమ కురిపిస్తుంటారు మ‌హేష్‌, న‌మ్ర‌త‌లు. ఇక సితార, మహేష్ కలిసి చేసే అల్లరి మామూలుగా ఉండదు. అయితే కొన్ని రోజుల నుంచి సితార ఎక్కువగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ వచ్చింది.

ఆనీ మాస్టర్ నేతృత్వంలో సితార డ్యాన్స్ నేర్చుకుంటూ వచ్చింది సితార‌. అయితే అదేదో టైం పాస్ కాదని, సర్కారు వారి పాట సినిమా కోసమని తాజాగా తెలిసి వచ్చింది. సర్కారు వారి పాట నుంచి రాబోతోన్న సెకండ్ సింగిల్ పెన్నీ పాటలో సితార మెరిసింది. ఆమె వేసిన స్టెప్పులకు ఘట్టమనేని అభిమానులు మాత్రమే కాదు.. సినీ ప్రేమికులంతా ఫిదా అవుతున్నారు. ఇలా సితార తెరపై కనిపించడం ఇదే మొదటి సారి. పైగా తండ్రి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇలా సితార రాక్ స్టార్ అవతరాన్ని ఎత్తేసింది. క‌ళావ‌తి సాంగ్‌కి కూడా త‌నదైన డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టింది సితార‌.

sitara photoshoot viral

sitara photoshoot viral

Sitara : సితార హంగామా మాములుగా లేదుగా…

ఉగాది పండగ‌ సందర్భంగా ట్రెడిషనల్‌ లుక్‌లో ఓ బ్యూటిఫుల్‌ ఫోటోషూట్‌ చేయించుకుంది సితార. దానికి సంబంధించిన వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ..‘అందరికి ఉగాది శుభాకాంక్షలు’ అని అచ్చమైన తెలుగులో చెప్పింది. ఆ వీడియో సితార డ్రెడిషనల్‌ లుక్‌లో యువరాణిలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇక తాజాగా సితార క్యూట్ లుక్స్ లో ఫొటో షూట్ చేయించుకుంది. ఇందులో సితార స్ట‌న్నింగ్ లుక్స్ చూసి మెస్మ‌రైజ్ అవుతున్నారు. చిన్నారి అందాల‌కు మైమ‌ర‌చిపోతున్నారు. ఫ్యూచ‌ర్ స్టార్ అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది