Sneha : సెగ పుట్టిస్తున్న స్నేహా.. హాట్ హాట్ అందాల‌తో మెస్మ‌రైజ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sneha : సెగ పుట్టిస్తున్న స్నేహా.. హాట్ హాట్ అందాల‌తో మెస్మ‌రైజ్

 Authored By mallesh | The Telugu News | Updated on :14 April 2022,5:30 pm

Sneha: తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో టాలీవుడ్ మంచి స్థానాన్ని సొంతం చేసుకుంది. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ సుధీర్ఘ కాలం పాటు టాప్ హీరోయిన్‏గా కొనసాగింది. తమిళ, తెలుగు, మలయాళం బాషలలో నటించి ప్రత్యేక స్థానం దక్కించుకుంది. తెలుగులో ప్రియమైన నీకు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన‌ స్నేహా ఓ మంచి సూపర్ హిట్ మూవీని అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

అలాగే తమిళ హీరో ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పిల్లల కోసం కొంత కాలం గ్యాప్ తీసుకొని మళ్లి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది.హోమ్లీ క్యారెక్ట‌ర్స్ ప్లే చేయ‌డంతో పాటు స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోలంద‌రితో న‌టించింది. క్లాస్ పాత్ర‌ల‌తో మంచి పేరు తెచ్చుకుంది. నాగార్జున న‌టించిన‌ శ్రీ‌రామ‌దాసు చిత్రంలో మంచి న‌ట‌న క‌న‌బ‌ర్చింది. తరుణ్ హీరోగా వచ్చిన ‘ప్రియమైన నీకు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన స్నేహా హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, సంక్రాంతి, రాధా గోపాలం, వెంకీ వంటి హిట్ సినిమాల్లో నటించింది.

sneha latest pics in Viral

sneha latest pics in Viral

Sneha : సెగ పుట్టిస్తున్న స్నేహా.. హాట్ హాట్ అందాల‌తో మెస్మ‌రైజ్

వినయవిధేయ రామ సినిమాలో రామ్ చరణ్‌కు వదినగా నటించి అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం యాడ్స్ లో కూడా నటిస్తూ ప‌లు సినిమాలు చేస్తోంది. అయితే 40 ఏళ్ల‌ వయసులో కూడా స్నేహా త‌న అందంతో మెస్మ‌రైజ్ చేస్తోంది. ఇప్ప‌టి హీరోయిన్స్ కు ఏమాత్రం త‌గ్గ‌కుండా త‌న అందం అభిన‌యంతో ఆక‌ట్టుకుంటోంది. ఇక రీసెంట్ గా స్నేహ తన ఇంస్టాగ్రామ్ ఖాతా లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. దీంతో ఆమె ఫాన్స్ మురిసిపోతున్నారు. ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫొటోలు మీరుకూడా చూసేయండి..

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది