Sreeja Konidela : వాళ్లే నా ప్రపంచం.. శ్రీజ కొణిదెల పోస్ట్ వైరల్
Sreeja Konidela : శ్రీజ కొణిదెల ఈ మధ్య ఏ పోస్ట్ పెట్టినా కూడా హాట్ టాపిక్‌గా మారుతోంది. శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్‌తో విడిపోయిందనే వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. శ్రీజ, కళ్యాణ్ దేవ్‌లు కలిసి ఉండటం లేదనే టాక్ ఎక్కువైంది. కానీ ఈ ఇద్దరి విడాకుల ప్రకటన మాత్రం ఇంత వరకు బయటకు రాలేదు. ఎక్కడా కూడా అధికారికంగా ఏమీ కూడా ప్రకటించలేదు. అయితే కళ్యాణ్ దేవ్ మాత్రం మెగా కాంపౌండ్‌కు దూరంగానే ఉంటున్నాడు.శ్రీజ కూడా తన ఇన్ స్టా హ్యాండిల్ పేరుని మార్చేసింది.
శ్రీజ కళ్యాణ్‌గా ఉన్న పేరుని కాస్తా.. శ్రీజ కొణిదెలగా మార్చుకుంది. దీంతో అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. అంతకు ముందు నుంచీ ఈ విడాకుల రూమర్లు వచ్చినా కూడా శ్రీజ చేసిన పనితో అది అందరికీ కన్ఫామ్ అయిపోయింది. కానీ ఇంత వరకు కూడా విడాకుల మీద ఈ ఇద్దరూ ఎక్కడా నోరు విప్పలేదు.అయితే ఇంత వరకు కూడా ఈ ఇద్దరూ కలిసి కనిపించిన ఫోటో ఎక్కడా లేదు. కనీసం పిల్లలతో ఉన్న ఫోటోలను కూడా కళ్యాణ్ దేవ్ షేర్ చేయడం లేదు.

Sreeja Konidela shares her daughters pic at weekend
తన పాప నవిష్క కూడా శ్రీజ వద్దే ఉన్నట్టు కనిపిస్తోంది. నవిష్కకు సంబంధించిన వీడియోలు, ఫోటోల మీద అప్పుడప్పుడు కళ్యాణ్ దేవ్ స్పందిస్తుంటాడు. ఇక శ్రీజ కూడా నవిష్కకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది.కానీ కళ్యాణ్ దేవ్ గురించి మాత్రం శ్రీజ రియాక్ట్ అవ్వడం లేదు. ఈ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసుకోవడం లేదు. తాజాగా శ్రీజ తన కూతుళ్ల ఫోటోలను షేర్ చేస్తూ వాళ్లే తన ప్రపంచమని చెప్పేసింది.

Sreeja Konidela shares her daughters pic at weekend