Sreeleela : శ్రీలీల ఊర మాస్ .. కుళ్ళుకుని సచ్చిపోతోన్న సమంత , తమన్నా , కృతి శెట్టి ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreeleela : శ్రీలీల ఊర మాస్ .. కుళ్ళుకుని సచ్చిపోతోన్న సమంత , తమన్నా , కృతి శెట్టి !

 Authored By aruna | The Telugu News | Updated on :16 June 2023,11:00 am

Sreeleela : ‘ పెళ్లి సందడి ‘ సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది యంగ్ బ్యూటీ శ్రీలీల. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించిన శ్రీ లీల ధమాకా సినిమాతో మరింత దగ్గరయింది. కేవలం నటన పరంగానే కాకుండా డాన్స్ తో కూడా ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కు లేని సినీ అవకాశాలు శ్రీ లీల కి వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఏడు , ఎనిమిది ప్రాజెక్టులు ఉన్నట్లు టాక్. ఏ హీరోతో ఛాన్స్ వచ్చిన ఓకే చెబుతూ ముందుకు వెళుతుంది. ఓవైపు హీరోయిన్గా నటిస్తూనే మరోవైపు సిస్టర్ రోల్స్, సెకండ్ లీడ్ ఉన్న పాత్రలు చేస్తుంది.

రోజురోజుకీ ఈ బ్యూటీకి మాస్ ఫాలోయింగ్ పెరుగుతూ వస్తుంది. తాజాగా ఈ అంశంపై ఆసక్తికర సమాధానం చెప్పింది. కమర్శియల్ సినిమాల్లో ఉండే మాస్ సన్నివేశాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. అలాంటి సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టం. ఇక నటించే ఛాన్స్ నా వరకూ వస్తే విడిచి పెడతానా వెంటనే సైన్ చేసేయను అంటూ చెప్పుకొచ్చింది. దీనిని బట్టి శ్రీ లీలకి మాస్ కంటెంట్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ అని తెలుస్తుంది. అందుకే ఇండస్ట్రీలో మాస్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అలాగే హీరోల అందరితో కలిసి నటించిన గొప్ప ఎక్స్పీరియన్స్ గా ఉందని తెలిపింది.

eeleela intrest to act in mass movies

eeleela intrest to act in mass movies

నటించిన ప్రతి హీరోతో ఏదో ఒకటి నేర్చుకుంటాను. ఏ హీరో ప్రత్యేకత వారికి ఉంది. వారి సీక్రెట్ టెక్నిక్లను అడిగి తెలుసుకుంటాను. కొత్త వాళ్లతో పనిచేసి కొత్త విషయాలు తెలుసుకుంటాను. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే మంచి విజయాలు కనిపించాలి. చేసే ప్రతి సినిమా ప్రేక్షకుడి హృదయాల్లో నిలిచిపోవాలి. నటులు కావాలనే ప్రతి ఒక్కరిని ఇండస్ట్రీ ఆకర్షిస్తుంది. ఇండస్ట్రీలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది అని ఉంది. ఏదేమైనా శ్రీలీల చాలా తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కి లేని క్రేజ్ అమ్మడి సొంతం.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది