Sreemukhi : అయిపాయె.. యాంకర్ ప్రదీప్ కు ఐలవ్యూ చెప్పేసిన శ్రీముఖి? షాక్ లో అభిమానులు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreemukhi : అయిపాయె.. యాంకర్ ప్రదీప్ కు ఐలవ్యూ చెప్పేసిన శ్రీముఖి? షాక్ లో అభిమానులు..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :7 July 2021,12:51 pm

Sreemukhi : యాంకర్ శ్రీముఖి తెలుసు కదా. తనకు ఉన్న పాపులారిటీ బుల్లితెర మీద ఎవ్వరికీ లేదు. అది తన రేంజ్. తనకు మామూలు క్రేజ్ లేదు. తను సినిమాల్లోనూ హీరోయిన్ గా చలామణి అవుతోంది. అడపా దడపా సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరను ఏలేస్తోంది. యాంకర్ శ్రీముఖి అచ్చమైన తెలంగాణ యాసలో యాంకరింగ్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. బుల్లితెర మీద యాంకర్ సుమ తర్వాత అంతటి పాపులారిటీ సంపాదించుకుంది శ్రీముఖి. బిగ్ బాస్ 3 సీజన్ లోనూ తనేంటో అందరికీ నిరూపించింది.

sreemukhi and anchor pradeep in drama juniors

sreemukhi and anchor pradeep in drama juniors

తనతో పాటే ఈక్వల్ గా మేల్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్నాడు యాంకర్ ప్రదీప్. ఆయన కూడా అంతే. ఆయనకూ బుల్లితెర మీద విపరీతమైన క్రేజ్. వాళ్లిద్దరికీ ఉన్న పాలోయింగే వేరు. అందుకే ఇద్దరూ టాప్ యాంకర్లుగా బుల్లితెర మీద కొనసాగుతున్నారు.

Sreemukhi : డ్రామా జూనియర్స్ లో స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి

యాంకర్ ప్రదీప్ కూడా అడపా దడపా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమాలో హీరోగా నటించాడు ప్రదీప్. శ్రీముఖి, ప్రదీప్ ఇద్దరూ కలిసి కూడా చాలా షోలలో నటించాడు. దశాబ్దాల నుంచి వీళ్ల మధ్య స్నేహం నడుస్తోంది. వీళ్ల మధ్య అంత సాన్నిహిత్యం కూడా ఉంది. ఆ సాన్నిహిత్యంతోనే వాళ్లిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే.. అవన్నీ ఉత్తవేనని.. తమ మధ్య అలాంటిదేం లేదని ఇద్దరూ చాలాసార్లు చాలా వేదికల మీద చెప్పుకొచ్చారు.

sreemukhi and anchor pradeep in drama juniors

sreemukhi and anchor pradeep in drama juniors

కట్ చేస్తే.. తాజాగా శ్రీముఖి.. యాంకర్ ప్రదీప్ కు స్టేజ్ మీదనే ఐలవ్యూ చెప్పేసింది. అతిలోక సుందరి గెటప్ వేసుకొని.. డ్రామా జూనియర్స్ షోలో దర్శనమిచ్చిన శ్రీముఖి.. యాంకర్ ప్రదీప్ కు సిగ్గు పడుతూ.. ఐలవ్యూ చెప్పేసింది. ఊహించని ఈ ఘటనకు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. డ్రామా జూనియర్స్ జడ్జి సింగర్ సునీత కూడా నోరెళ్లబెట్టేసింది. మరి.. ఇదంతా కేవలం డ్రామానా లేక.. నిజంగానే తన మనసులో మాటను శ్రీముఖి చెప్పిందా? అనే విషయం తెలియాలంటే మాత్రం డ్రామా జూనియర్స్ ఫుల్ ఎపిసోడ్ ప్రసారం అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతానికైతే డ్రామా జూనియర్స్ లేటెస్ట్ ప్రోమోను చూసేయండి.

YouTube video

ఇది కూడా చ‌ద‌వండి ==> వైవాహిక జీవితంపై నెటిజన్ ప్రశ్న.. షాకింగ్ రిప్లయి ఇచ్చిన నిహారిక..?

ఇది కూడా చ‌ద‌వండి ==> నువ్వు మంచం రెడీ చేసుకో అనసూయ.. చంపేస్తా ఆది.. స్టేజ్ మీదే హైపర్ ఆదికి సీరియస్ వార్నింగ్?

ఇది కూడా చ‌ద‌వండి ==>  రాజమౌళి – మహేష్ కాంబో.. పొరపాటున పాయింట్ లీక్ చేసిన విజయేంద్ర ప్రసాద్

ఇది కూడా చ‌ద‌వండి ==> రాజ‌మౌళిపై రామ్ ల‌క్ష్మ‌ణ్ సంచ‌ల‌న వ్యాఖ్యలు..!

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది