Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ – అప్పుడు శ్రీముఖి, ఇప్పుడు ఉదయభాను, సత్తా చాటుతున్న యాంకర్స్
Bigg Boss 6 Telugu : తెలుగు బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ అంటే పెద్దగా గుర్తింపు లేని వారు.. ఫేడ్ ఔట్ అయిన వారు మాత్రమే ఉంటారు అనే అభిప్రాయం ఉంది. నిజంగానే కూడా చాలా మంది కంటెస్టెట్స్ ను జనాలు వెంటనే గుర్తించలేరు కూడా. ఒక వేళ ఫేమ్ ఉన్న కంటెస్టెంట్స్ ను.. ప్రస్తుతం సందడి చేసే కంటెస్టెంట్స్ ను తీసుకు వస్తే అప్పుడు భారీ ఎత్తున పారితోషికం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే బిగ్ బాస్ నిర్వాహకులు చాలా తక్కువ సార్లు మాత్రమే ఎక్కువ పారితోషికం ఇచ్చి స్టార్ కంటెస్టెంట్స్ ను రంగంలోకి దించుతారు. అందుకే బిగ్ బాస్ లో వారు ఉన్నప్పుడు సందడి వేరుగా ఉంటుంది.
ఆ మధ్య బిగ్ బాస్ లో శ్రీముఖి ఎంట్రీ ఇచ్చినప్పుడు సందడి మామూలుగా లేదు. ఆమెకు అత్యధిక పారితోషికం ఇచ్చి మరీ బిగ్ బాస్ లో చేయించారు. ఆమె ను బిగ్ బాస్ లో అత్యధిక పారితోషికం తీసుకున్న కంటెస్టెంట్ గా ఇప్పటి వరకు పేర్కొంటూ వచ్చారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 లో ఉదయ భాను ను ఎంపిక చేయడం జరిగింది. ఆమె పారితోషికం కూడా భారీగా ఉందట. ఇప్పటి వరకు ఏ తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ కి కూడా ఇవ్వనంత పారితోషికం ను తెలుగు బిగ్ బాస్ నిర్వాహకులు ఉదయ భాను కు ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

Sreemukhi and Udaya Bhanu remunerations for Bigg Boss 6 Telugu
గతంలో శ్రీముఖి కి ఇచ్చిన స్థాయి లోనే ఉదయ భాను కి పారితోషికం ను ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. కొందరు శ్రీముఖి కంటే కాస్త ఎక్కువ పారితోషికం ఇవ్వబోతున్నారు.. మరి కొందరు మాత్రం ఉదయ భాను కంటే తక్కువే శ్రీముఖి తీసుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బిగ్ బాస్ లో లేడీ యాంకర్స్ సత్తా చాటుతూ ఉంటే సాదారణ ప్రేక్షకులు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ కోసం ఉదయ భాను రెడీ అవుతోంది. సెప్టెంబర్ 4న బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఉదయ భాను ఇప్పటికే క్వారెంటైన్ కు వెళ్లిందని సమాచారం అందుతోంది.