Sreemukhi : కురచ దుస్తులలో మత్తెక్కిస్తున్న శ్రీముఖి.. కేక పెట్టిస్తుందిగా..!
Sreemukhi : బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు శ్రీముఖి. పలు షోలతో యాంకర్‌గా బిజీగా ఉంది. అందులో `కామెడీస్టార్స్` ప్రధానంగా చెప్పొచ్చు. వీటితోపాటు సండే స్పెషల్ షోలో, అలాగే పండుగల సందర్భంగా నిర్వహించే ప్రత్యేకమైన షోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారుతుంది. వరుసగా కామెడీ షోలతో ఎంటర్‌టైన్ చేస్తుందీ భారీ అందాల భామ. టాలీవుడ్ లో ఎనెర్జిటిక్ యాంకర్ గా, బుల్లితెర రాములమ్మగా గుర్తింపు సొంతం చేసుకుంది శ్రీముఖి. శ్రీముఖి అందంతో కూడా అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది.
బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే వెండితెరపై కూడా మెరవాలని శ్రీముఖి ప్రయత్నిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది. శ్రీముఖి గత ఏడాది ‘క్రేజీ అంకుల్స్’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది.

sreemukhi beautiful looks viral
Sreemukhi : స్టన్నింగ్ లుక్స్..
చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం. తరచుగా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. పొట్టి దుస్తులలో శ్రీముఖి చేసే రచ్చ మాములుగా ఉండదు. తాజాగా కురచ దుస్తులలో శ్రీముఖి క్యూట్ లుక్స్ షేర్ చేస్తూ మెంటలెక్కిస్తుంది. తాజాగా శ్రీముఖి స్టన్నింగ్ లుక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. బ్యూటీ స్టన్నింగ్ లుక్స్‌కి మెస్మరైజ్ అవుతున్నారు. స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని ఇమేజ్ కలిగి ఉన్న శ్రీముఖి. సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ మాములుగా ఉండదు. ట్రెండీ అయినా, ట్రెడిషనల్ అయినా..శ్రీముఖి ఏ లుక్ ట్రై చేసినా అదిరి పోవాల్సిందే. గ్లామర్ కి ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడంతో ఫ్యాన్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.