Sreemukhi : నిరుపమ్ అంటే భయమంటున్న శ్రీముఖి.. ఆ హీరోకి యాంకర్ కంప్లయింట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreemukhi : నిరుపమ్ అంటే భయమంటున్న శ్రీముఖి.. ఆ హీరోకి యాంకర్ కంప్లయింట్

 Authored By mallesh | The Telugu News | Updated on :3 October 2021,7:40 pm

Sreemukhi : మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ఫస్ట్ ఫిల్మ్ ‘ఉప్పెన’తోనే సత్తా చాటాడు. మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వంటి మామలకు తగ్గ అల్లుడని నిరూపించుకున్నాడు. ఇకపోతే తేజ్ నెక్ట్ట్ ఫిల్మ్ ‘కొండపొలం’ ఈ నెల 8న రిలీజ్ కాబోతున్నది. ఈ సందర్భంగా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో వైష్ణవ్ తేజ్ పాల్గొంటున్నాడు.జీ తెలుగు చానల్‌లో దసరా పండుగ సందర్భంగా ‘దసరా దోస్తీ’ పేరిట స్పెషల్ కార్యక్రమాన్ని రూపొందించారు.

sreemukhi compliant nirupam to vaishnav tej

sreemukhi compliant nirupam to vaishnav-tej

Sreemukhi : ‘దసరా దోస్తీ’ పంజా వైష్ణవ్ తేజ్ సందడి..

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను జీ చానల్ వారు ఇన్ స్టా గ్రామ్ వేదికగా విడుదల చేయగా అది ఆకట్టుకుంటోంది. ఇక ఈ కార్యక్రమానికి శ్రీముఖి యాంకర్‌ గా వ్యవహరిస్తున్నారు. ‘ఉప్పెన’ చిత్రంలోని సంభాషణలను ప్రోగ్రాంలో రిపీట్ చేసే ప్రయత్నం చేశారు. యాంకర్ శ్రీముఖి వైష్ణవ్ తేజ్‌తో సరాదాగా ముచ్చటించి నవ్వులు పూయించినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది.

sreemukhi compliant nirupam to vaishnav tej

sreemukhi compliant nirupam to vaishnav-tej

‘ఉప్పెన’ సినిమాలోని డైలాగ్ ‘గుడియమ్మ చెప్పేదైనా? నీకు నానంటే భయమా? నీళ్లంటే భయమా’ అని వైష్ణవ్ తేజ్ అడగ్గా తనకు నిరుపమ్ అంటే భయమని చెప్పి శ్రీముఖి ఫన్ క్రియేట్ చేసింది.ఇకపోతే శ్రీముఖి ఉప్పెన చిత్రంలో వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతిని గురించి ప్రస్తావిస్తూ అక్కడ ఆయన విలన్ అయితే, ఇక్కడ నిరుపతి విలన్ అని చెప్పబోయింది. ఈ క్రమంలో వెంటనే పంచ్ ఇచ్చేశాడు వైష్ణవ్ తేజ్. ఇప్పుడు ఎందుకు అండీ అవన్నీ.. మళ్లీ క్లైమాక్స్ వరకు వెళ్లాల్సి ఉంటుందని పంచ్ వేసేశాడు. ‘దసరా దోస్తి’ పూర్తి కార్యక్రమం ఈ నెల 10 న సాయంత్రం ఆరు గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.

sreemukhi compliant nirupam to vaishnav tej

sreemukhi compliant nirupam to vaishnav-tej

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది