Sremukhi : అంతటా శ్రీముఖి సందడే.. బుల్లితెరపై రాములమ్మ ఫుల్ బిజీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sremukhi : అంతటా శ్రీముఖి సందడే.. బుల్లితెరపై రాములమ్మ ఫుల్ బిజీ

 Authored By prabhas | The Telugu News | Updated on :25 June 2022,7:00 pm

Sremukhi : బుల్లితెరపై రాములమ్మగా శ్రీముఖికి మంచి ఇమేజ్ ఏర్పడింది. పటాస్ అనే షో శ్రీముఖి కెరీర్‌ను టర్న్ చేసింది. ఆ షోతో శ్రీముఖి క్రేజీ యాంకర్‌గా మారింది. శ్రీముఖికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది.అలా ఆ షోలో చేసిన సందడితోనే.. ఆమెకు బిగ్ బాస్ ఎంట్రీ దొరికింది. బిగ్ బాస్ మూడో సీజన్‌లో శ్రీముఖికి వచ్చిందంటే దానికి కారణం పటాస్ షో వల్ల వచ్చి ఇమేజ్. అలా మొత్తానికి శ్రీముఖి మాత్రం బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టేసింది. ఇక ఆమె విజేతగా నిలుస్తుందని మొదట్లో అందరూ అనుకున్నారు. కానీ ఆమె తన చేజేతులా అంతా నాశనం చేసుకుంది.

రాహుల్ సిప్లిగంజ్ మీద పగబట్టడంతో ఆమె ఇమేజ్ పూర్తిగా మారింది. ఆమె మీద ఎక్కువగా నెగెటివ్ ఇమేజ్ ఏర్పడింది.శ్రీముఖి చేసిన చేష్టల వల్ల రాహుల్ విజేతగా నిలిచినట్టు అయింది. మొత్తానికి శ్రీముఖి మాత్రం బిగ్ బాస్ ఇంటి నుంచి రన్నర్‌గా బయటకు వచ్చింది. శ్రీముఖికి బిగ్ బాస్ తరువాత ఏ షో చేసినా కూడా కలిసి రాలేదు చేసిన ప్రతీ షో మధ్యలోనే బెడిసి కొట్టేసింది. శ్రీముఖి చేసిన షోలు మధ్యలో మకాం ఎత్తేస్తూ వచ్చాయి. అలా అదిరింది, బొమ్మ అదిరింది వంటి షోలు మధ్యలోనే ఆగిపోయాయి. స్టార్ట్ మ్యూజిక్ షోను కూడా ఆపేశారు.

Sremukhi Busy With Zee Telugu Star Maa Events

Sremukhi Busy With Zee Telugu Star Maa Events

అలా శ్రీముఖి ఎక్కడకు వెళ్లినా అక్కడి షోలు ఆగిపోతూ వచ్చాయి.కానీ ఇప్పుడు మాత్రం శ్రీముఖి మంచి ఊపు మీదున్నట్టు కనిపిస్తోంది. శ్రీముఖి ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగులో మోస్ట్ వాంటెడ్ యాంకర్‌గా మారిపోయింది. అంతటా ఆమే కనిపిస్తుంది. అన్ని షోలను ఆమే నడిపిస్తోంది. ఇప్పుడు శ్రీముఖి ఈటీవీలో జాతి రత్నాలు అనే షోను హోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. స్టార్ మాలో అయితే స్పెషల్ ఈవెంట్లను ముందుండి నడిపిస్తోంది. ఇప్పుడు మొగుడ్స్ పెళ్లామ్స్ అనే షోను నడిపిస్తోంది. ఇక జీ తెలుగులో అయితే సింగింగ్ షోను సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తోంది. అయితే అందులో ఆమె ధరిస్తున్న పొట్టి బట్టల మీద మాత్రం ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతోంది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది