Sridevi : శ్రీదేవి తల్లి – శ్రీదేవి ఇద్దరు కలిసి అతనితో ???? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sridevi : శ్రీదేవి తల్లి – శ్రీదేవి ఇద్దరు కలిసి అతనితో ????

 Authored By prabhas | The Telugu News | Updated on :26 February 2023,7:40 pm

Sridevi : అతిలోక సుందరి శ్రీదేవి అప్పట్లో సౌత్ ఇండియ ను ఒక ఊపు ఊపేసింది. స్టార్ హీరోలు అందరితో నటించిన ఆమె ఇండస్ట్రీలో ఎన్నటికీ చెరగని ముద్రను వేసుకున్నారు. తన అందంతో, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశారు. అయితే శ్రీదేవితో పాటు శ్రీదేవి అమ్మ రాజేశ్వరి దేవి కూడా పలు సినిమాలలో నటించారు. శ్రీదేవి తల్లికి సినీ బ్యాక్ గ్రౌండ్ ఉందనే విషయం ఎవరికీ తెలియదు. శ్రీదేవి సినీ వారసత్వం నుంచి వచ్చారన్నది చాలామందికి తెలియదు. శ్రీదేవి పూర్వీకులది చిత్తూరు జిల్లా. వీరంతా చిత్తూరు జిల్లా నుంచి తమిళనాడు వెళ్లి స్థిరపడ్డారు. అక్కడే శ్రీదేవి జన్మించింది.

Sridevi and his mother act with that star hero

Sridevi and his mother act with that star hero

శ్రీదేవి తెలుగులో పాటు తమిళంలో కూడా ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా మారింది. శ్రీదేవి మొదటగా ‘ బడిపంతులు ‘ సినిమాలో ఎన్టీఆర్ కు మనవరాలిగా నటించింది. అలాగే మరో సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కూతురుగా నటించింది. అలాంటి శ్రీదేవి అదే కృష్ణ, ఎన్టీఆర్ కు జోడిగా హీరోయిన్ గా నటిస్తుందని ఎవరు అనుకోలేదు. అయితే శ్రీదేవి నేరుగా సినిమాల్లోకి వచ్చిందని చాలామంది అనుకుంటారు. శ్రీదేవి తల్లి రాజేశ్వరి దేవి కూడా సినిమాలో నటించారు. ప్రఖ్యాత దర్శకుడు కొల్లి ప్రత్యగాత్మ తీసిన మొదటి సినిమా ‘ భార్యాభర్తలు ‘.

ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించారు. హీరోయిన్ తో పాటు ఉండే మిత్ర బృందంలో రాజేశ్వరి ఉంటుంది. అలాగే సినిమాలో జోరుగా హుషారుగా అనే పాటలో ఏఎన్ఆర్ తో కూడా ఆమె కనిపిస్తుంది. ఆ తర్వాత అదే ఏఎన్ఆర్ కు జోడిగా ఆమె కుమార్తె శ్రీదేవి పలు సినిమాలలో నటించారు. అంటే ఏఎన్ఆర్ అటు తల్లి తోను ఇటు కూతురుతోను స్క్రీన్ పంచుకున్నారు. ఇక శ్రీదేవి ఏఎన్ఆర్ తో పాటు ఆయన కొడుకు నాగార్జునకు కూడా జోడిగా నటించారు ఇది మరో రికార్డ్ అని చెప్పాలి. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీదేవి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది