Jabardast : రోజా, ఇంద్రజ, ఆమని, లైలా…. ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారో చూడండ్రా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jabardast : రోజా, ఇంద్రజ, ఆమని, లైలా…. ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారో చూడండ్రా..!

 Authored By prabhas | The Telugu News | Updated on :30 March 2022,1:30 pm

Jabardast : ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో జడ్జి గా మొదట నాగబాబు మరియు రోజా వ్యవహరించారు. వీరిద్దరూ చాలా సంవత్సరాల పాటు కొనసాగారు. అయితే నాగబాబుకి మల్లెమాల వారి తో వచ్చిన విభేదాల కారణంగా ఆయన బయటకు వెళ్ళి పోయాడు. ఆ స్థానంలో ఇద్దరు ముగ్గురు వచ్చారు. కాని వారు ఆకట్టుకోలేక పోయారు. చివరకు సింగర్ మనో వచ్చి సెటిలైపోయాడు. ఇప్పుడు గెస్ట్ జడ్జిలుగా అప్పుడప్పుడు సీనియర్ హీరోయిన్లు ఇంద్రజ, ఆమని, లైలా వస్తున్నారు. ఇటీవల మనో లేకపోవడంతో ఏకంగా ముగ్గురు లేడీ జడ్జిలు షోలో కనిపించారు.రోజా, ఇంద్రజ, లైలా, ఆమని ఇలా నలుగురు సీనియర్ హీరోయిన్లు ఇప్పటికే జబర్దస్త్ స్టేజి పై సందడి చేశారు.

ముందు ముందు మరింత మంది సీనియర్ హీరోయిన్లు వస్తారేమో అంటూ తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఈ నలుగురు జడ్జిలు ప్రేక్షకులను మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా రోజా జబర్దస్త్ లో ఉంటే శ్రీదేవి డ్రామా కంపెనీ లో సీనియర్ హీరోయిన్ ఇంద్రజ అదరగొట్టేస్తున్నారు. వీరిద్దరికి తోడు అన్నట్లుగా అప్పుడప్పుడు వచ్చి ఆమని వచ్చి హంగామా చేస్తూనే ఉంది.మరోవైపు లైలాను తీసుకు వచ్చి కొత్తగా ప్రేక్షకుల ముందుకు పరిచయం చేసే ప్రయత్నాలు చేశారు. రోజా చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది.

sridevi drama company and jabardast show judge news

sridevi drama company and jabardast show judge news

మొదటి ఎపిసోడ్ లోనే మంచి మార్కులను లైలా సొంతం చేసుకోవడంతో ఆమెని ముందు ముందు కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. వీరు కాకుండా ఇంకా ఎంత మంది సీనియర్ హీరోయిన్లు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు జబర్దస్త్ స్టేజీల పై కనిపిస్తారో తెలియడం లేదు అంటూ బుల్లి తెర విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున షో లకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యం లో ఇలా సీనియర్ హీరోయిన్లు రావడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని తెలుస్తోంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది