BB Jodi Telugu : బిబి జోడి ఎంతగా విప్పి చూపించినా జనాలు పట్టించుకోవడం లేదట పాపం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BB Jodi Telugu : బిబి జోడి ఎంతగా విప్పి చూపించినా జనాలు పట్టించుకోవడం లేదట పాపం

 Authored By prabhas | The Telugu News | Updated on :17 February 2023,10:00 pm

BB Jodi Telugu : బిగ్‌ బాస్ తో పాపులారిటీని సొంతం చేసుకున్న సెలబ్రిటీలను తీసుకు వచ్చి బిబి జోడి అంటూ ఒక డాన్స్ కార్యక్రమాన్ని స్టార్ మా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సాగుతున్న బిబి జోడీ కార్యక్రమానికి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఈ మధ్య కాలంలో బిగ్‌ బాస్ ద్వారా సందడి చేసిన కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి డాన్స్ చేస్తూ అలరించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ కార్యక్రమానికి ప్రేక్షకుల నుండి సరైన స్పందన రావడం లేదని రేటింగ్ చూస్తే అర్థమవుతుంది.

star maa tv BB Jodi Telugu dance show not going well

star maa tv BB Jodi Telugu dance show not going well

బిగ్‌ బాస్ సెలబ్రిటీలు కనుక మంచి రేటింగ్ వస్తుందని నిర్వాహకులు భావించారు. కానీ బిగ్ బాస్ లో చూసిన వారిని మళ్లీ చూస్తామనుకొని కొందరు లైట్ తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే బిబి జోడి కి పెద్దగా ఆదరణ లభించడం లేదు. స్టార్ మా లో ఈ మధ్య కాలంలో వచ్చిన కార్యక్రమాలన్నింటిలో పోలిస్తే ఈ కార్యక్రమానికి దారుణమైన రేటింగ్ నమోదు అవుతుందని బుల్లి తెర వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

star maa tv BB Jodi Telugu dance show not going well

star maa tv BB Jodi Telugu dance show not going well

ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలోనే కార్యక్రమాన్ని నిలిపి వేసే అవకాశాలు లేకపోలేదు అంటూ బుల్లి తెర వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. యాంకర్ గా శ్రీముఖి వ్యవహరిస్తుండగా పలువురు ప్రముఖులు జడ్జి స్థానంలో కనిపిస్తున్నారు. ఆయన కూడా ఈ కార్యక్రమాన్ని జనాలు పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉందని స్టార్ మా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచిని తెలుసుకుని మంచి కార్యక్రమాలను తీసుకు రావాలని కొందరు కార్యక్రమాన్ని విశ్లేషిస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది