Star Maa comedy Stars : ఎట్టకేలకు స్టార్ మా కామెడీ స్టార్స్ సక్సెస్, కాని..!
Star Maa comedy Stars : ఈటీవీలో గత 9 ఏళ్లుగా ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా టాప్ రేటెడ్ కామెడీ షో గా దూసుకు పోతుంది. జబర్దస్త్ ను ఢీ కొట్టేందుకు ఇతర ఛానల్స్ కొన్ని కామెడీ షో లను తీసుకు వచ్చినా కూడా అంతగా ప్రభావం చూపించలేక పోయాయి. జీ తెలుగు లో అదిరింది అంటూ స్వయంగా నాగబాబు ప్రయత్నించినా కూడా వర్కౌట్ అవ్వలేదు. కొన్ని ఎపిసోడ్స్ కే దాన్ని తొలగించారు. ఇప్పుడు స్టార్ మా లో కామెడీ స్టార్స్ ను చేస్తున్నారు. కామెడీ స్టార్స్ స్టార్ మా లో ప్రారంభం అయ్యి చాలా వారాలు అవుతుంది. అయితే ఇప్పుడు నాగబాబు జడ్జ్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కొత్త పుంతలు తొక్కినట్లుగా ఉంది.కామెడీ స్టార్స్ ధమాకా అంటూ కొత్త సీజన్ కొత్త టీమ్ లీడర్స్ తో మొదటి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. జబర్దస్త్ కు ఏమాత్రం తీసిపోని విధంగా కామెడీ స్టార్స్ షో ఉందంటూ రివ్యూలు దక్కాయి.
మొదటి ఎపిసోడ్ తోనే మంచి రేటింగ్ కూడా దక్కించుకోవడం కష్టమే కాని మంచి ప్రశంసలు అయితే ఎపిసోడ్ కు వచ్చింది. అయితే ఆదివారం అది కూడా మద్యాహ్నం సమయంలో ఈ షో ను టెలికాస్ట్ చేయడం తప్పుడు నిర్ణయం అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రైమ్ టైమ్ లో అంటే రాత్రి సమయంలో టెలికాస్ట్ చేస్తే జబర్దస్త్ కు అసలైన పోటీగా ఈ షో నిలుస్తుందనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.జబర్దస్త్ ను ఇప్పుడు ఢీ కొట్టే స్థాయి కామెడీ స్టార్స్ కు ఉంది. మంచి కమెడియన్స్ కామెడీ స్టార్స్ లో ఉన్నారు. మంచి టీమ్ లీడర్లు ఉండటంతో ఖచ్చితంగా జబర్దస్త్ ను బీట్ చేయగల సత్తా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీక్ డేస్ లో లేదా వీకెండ్స్ లో రాత్రి 9 లేదా 9.30 కి కామెడీ స్టార్స్ ధమాకా టెలికాస్ట్ అయితేనే ఆ రికార్డును బ్రేక్ చేయగలుగుతుందని అంటున్నారు.
Star Maa comedy : జబర్దస్త్ ను ఢీ కొట్టే రేటింగ్ కామెడీ స్టార్స్ కు సాధ్యమే
అంతే కాకుండా జబర్తస్త్ ను ఎలా అయితే ఎపిసోడ్ మొత్తం యూట్యూబ్ లో ఉంచుతారో అలాగే కామెడీ స్టార్స్ ను కూడా యూట్యూబ్ లో ఉంచాలని.. అప్పుడే ప్రేక్షకుల ఆధరణ లభిస్తుందని అంటున్నారు. హాట్ స్టార్ లో ఇప్పుడు ఉన్నా కూడా ఎక్కువ శాతం హాట్ స్టార్ లో చూడరు. యూట్యూబ్ లో చూసే విధంగా ఉండాలని అంటున్నారు. నాగబాబు మరియు పూర్ణ లు జడ్జ్ లుగా వ్యవహరిస్తున్న ఈ కామెడీ స్టార్స్ ధమాకా కొత్త సీజన్ కు దీపిక పిల్లి యాంకర్ గా వ్యవహరిస్తుంది. యాంకర్స్ మరియు జడ్జ్ లను పదే పదే మార్చకుండా అలాగే ఉంచడం వల్ల కూడా ప్రేక్షకులను కట్టిపడేయవచ్చు. కనుక ఆ విషయంలో కూడా కామెడీ స్టార్స్ జాగ్రత్తగా ఉంటే మంచిది.