Sudheer : సుధీర్ జబర్దస్త్‌ను వీడాడా.. క్లారిటీ ఇచ్చేసిన గెటప్ శ్రీను..
Sudheer : బుల్లితెర పవర్ స్టార్ గా దూసుకుపోతున్న సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ టీవీలో ప్రసారం అయ్యే ప్రతి ఈవెంట్ లోనూ సుధీర్ ఉండాల్సిందే. ఆయన లేకపోతే అభిమానులకు ఆ షో పెద్దగా రీచ్ అవ్వదు అనేంతలా ఆయన పేరు సంపాదించుకున్నాడు. బుల్లితెరలో ఆయనకు ఉన్నంత ఫాలోయింగ్ ఇంకెవరికీ లేదనే చెప్పాలి. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ, పోవేపోరా, శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటుగా స్పెషల్ ఈవెంట్స్ లో కూడా సుధీర్ మెరుస్తూనే ఉన్నాడు. ఏ షో అయినా సరే సుధీర్ ఉంటే ఆ కిక్కే వేరు అనేంతలా ఆయన హవాను కొనసాగిస్తున్నాడు.
ఇక ఏ షో అయినా సరే కామెంట్లు మొత్తం సుధీర్ చుట్టూ తిరుగుతుంటాయి. ఇంతటి భారీ క్రేజ్ ఉన్న సుధీర్ ఇప్పుడు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ను వీడాడంటూ కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయంటూ విపరీతమైన చర్చ సాగుతోంది. చాలామంది కమెడియన్లు జబర్దస్త్ తో ఫేమస్ అయి ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లి జబర్దస్త్ ను వీడారు. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. కానీ సుధీర్ మాత్రం హీరోగా మారినా సరే జబర్దస్త్‌ను వీడట్లేదు. అదే ఆయనకు శ్రీరామ రక్షలా ఉంటోంది. అయితే ఆయన జబర్దస్త్‌న వీడుతున్నాడనే వార్తలపై తాజాగా గెటప్ శ్రీను క్లారిటీ ఇచ్చేశాడు

sudhir leaves jabardasth getape srinu given by clarity sudhir leaves jabardasth getape srinu given by clarity
Sudheer : జబర్దస్త్ నుంచి సినిమాల్లోకి..
రీసెంట్ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన గెటప్ శ్రీను సుదీర్ విషయంలో మాట్లాడాడు. సుధీర్ ఎన్నడూ కూడా జబర్దస్త్‌ను వీడుతానంటూ చెప్పలేదని, కాకపోతే కేవలం గ్యాప్ తీసుకుంటానంటూ చెప్పాడని శ్రీను వివరించారు. ఇప్పటికే రెండు సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడని, వీటితో పాటు షోలు కూడా చేయడంతో రెస్ట్ లేకుండా పోయి డిప్రెషనల్ లోకి వెళ్తున్నాడని శ్రీను క్లారిటీ ఇచ్చాడు. కాబట్టి క్రియేటివిటీ తగ్గితే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ చేయలేమని, అందుకే కొన్ని రోజులు దూరంగా ఉంటానని చెప్పినట్టు శ్రీను క్లారిటీ ఇచ్చేశాడు. రెండు నెలలు గ్యాప్ తీసుకుంటాడని ఆ తర్వాత ఎంట్రీ ఇస్తాడని వివరించాడు గెటప్ శ్రీను. ఇక సుధీర్ మీద వస్తున్న రూమర్లు అన్నీ అవాస్తవం అంటూ కొట్టి పారేశాడు శ్రీను.