Sudigali Sudheer : ఎన్టీఆర్, సుమలకే భారీ షాక్ ఇచ్చిన సుడిగాలి సుధీర్..!
Sudigali Sudheer : బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన వ్యక్తి సుడిగాలి సుధీర్. ఈటీవలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ ప్రోగ్రాం ద్వారా పాపులారిటీ సంపాదించుకుని ఆ తర్వాత కాలంలో వెండితెరపైన ఎంట్రీ ఇచ్చారు సుధీర్. ‘ఢీ’ షోలో టీమ్ మెంబర్‌గా, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోకు హోస్ట్‌గా ఉంటూనే పలు సినిమాల్లో కామెడీ రోల్స్ ప్లే చేస్తున్నారు. కాగా, ఓ విషయంలో సుడిగాలి సుధీర్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, పాపులర్ యాంకర్ సుమకు షాక్ ఇచ్చాడు.ఇటీవల ఆర్మాక్స్ మీడియా వారు మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షనల్ పర్సనాలిటీస్‌గా పలువురిని ఎంపిక చేశారు.
అందులో నాన్ ఫిక్షన్ కేటగిరీ వివరాలను తెలిపారు. ఈ కేటగిరీలో కమెడియన్ సుడిగాలి సుధీర్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచి రికార్డు సృష్టించాడు. కాగా సెకండ్ ప్లేస్‌లో జూనియర్ ఎన్టీఆర్, థర్డ్ ప్లేస్‌లో యాంకర్ సుమ ఉన్నారు.ఇక నాల్గో స్థానంలో ఓంకార్ ఉన్నారు. కాగా ఈ విషయం తెలుసుకుని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమురం భీంగా నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సెకండ్ ప్లేస్‌లో ఉంటూ, సుడిగాలి సుధీర్ ఫస్ల్ ప్లేస్‌లో ఉండటం ఏంటని అనుకుంటున్నారు. ఇక బుల్లితెరపై సందడి చేస్తున్న లేడీ యాంకర్స్‌లో సీనియర్ ప్లస్ నెంబర్ వన్ యాంకర్ అయినటువంటి సుమ థర్డ్ ప్లేస్‌కు వెళ్లడమేంటని చర్చించుకుంటున్నారు.
Sudigali Sudheer : సుధీర్ తర్వాత స్థానంలో జూనియర్ ఎన్టీఆర్..
వీరిరువురి కంటే కూడా సుధీర్ టైమింగ్, పంచ్‌లు అంత బాగుంటాయా అని అడుగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రాంకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంగతులు పక్కనబెడితే.. సుధీర్ నాన్ ఫిక్షనల్ పర్సనాలిటీస్ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ రావడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బుల్లితెరపైన కమెడియన్‌గా నటిస్తూ సినిమాల్లో ఫ్రెండ్ రోల్స్ ప్లే చేస్తున్న సుధీర్ ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’అనే చిత్రంతో సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా మెరిశాడు. ఈ మూవీలో సుధీర్ సరసన హీరోయిన్‌గా ధన్య బాలకృష్ణన్ నటించింది.