Sudigali Sudheer : అదరగొట్టిన సుడిగాలి సుధీర్ రీఎంట్రీ… రష్మీ కి లవ్ ప్రపోజ్..!!
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మరియు వీక్షకులను ఎంతగానో అలరించే జబర్దస్త్ కామెడీ షో ద్వారా సుధీర్ ఎంతో పాపులారిటీ సంపాదించాడు. గెటప్ శీను మరియు రాంప్రసాద్ తో సుధీర్ చేసే కామెడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ముగ్గురి స్కిట్ కి టీవీలోనే కాదు యూట్యూబ్ ఛానల్స్ లో కూడా భారీ ఎత్తున క్రేజ్ ఉంటది.
అటువంటి ఈ జబర్దస్త్ షో నుండి కొద్ది నెలల క్రితం సుధీర్ బయటకు వెళ్లిపోవడం తెలిసిందే. అయితే షో నుండి తాను బయటికి వెళ్లి పోవడానికి ప్రధాన కారణం ఆర్థిక ఇబ్బందులని సుధీర్ ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపారు. త్వరలోనే మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే సుధీర్ చెప్పినట్టుగానే తాజాగా.. మళ్లీ “ఎక్స్ ట్రా జబర్దస్త్” వేదికపై సుధీర్ సందడి చేశారు. ఈ క్రమంలో ఎప్పటిలాగానే యాంకర్ రష్మీ గౌతమ్ కి స్టేజి మీద ప్రపోజ్ చేశాడు.
యధావిధిగా గెటప్ శీను ఇంకా రాంప్రసాద్ కూడా.. సుధీర్ తో కలిసి స్టేజిపై రచ్చ చేశారు. చాలా కాలం తర్వాత జబర్దస్త్ స్టేజీపై సుధీర్ కనిపించడంతో జబర్దస్త్ ఆడియన్స్ సంతోషంగా ఉన్నారు. ఇదిలా ఉంటే సుధీర్ ఒకపక్క బుల్లితెరపై మరోపక్క వెండితెరపై రాణిస్తున్న సంగతి తెలిసిందే. “గాలోడు” అనే సినిమా కూడా చేయడం జరిగింది. ఈ సినిమా నవంబర్ 18 వచ్చే శుక్రవారం విడుదల కానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా సుధీర్ జబర్దస్త్ స్టేజిపై వచ్చి ఒకపక్క సినిమా ప్రమోషన్ చేసి మరోపక్క రెండు స్కిట్స్ చేయటంతో సుధీర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.