Sudigali Sudheer : రష్మి తో నీ పెళ్లి జరుగుతుందా లేదా..?? రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన సుధీర్… వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sudigali Sudheer : రష్మి తో నీ పెళ్లి జరుగుతుందా లేదా..?? రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన సుధీర్… వీడియో !

 Authored By aruna | The Telugu News | Updated on :22 November 2023,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Sudigali Sudheer : రష్మి తో నీ పెళ్లి జరుగుతుందా లేదా..??

  •  రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన సుధీర్...!

Sudigali Sudheer : జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు సుడిగాలి సుధీర్. ఆ క్రేజ్ తోనే ఆయన సినిమాలోకి అడుగు పెట్టారు. ‘ సాఫ్ట్ వేర్ సుధీర్ ‘ సినిమాతో హీరోగా వెండితెర మీద కనిపించారు. ఆ సినిమా సక్సెస్ కాకపోయినా తర్వాతి సినిమా ‘ గాలోడు ‘ మంచి హిట్ ను ఇచ్చింది. దీంతో సినిమాల స్పీడ్ పెంచారు సుడిగాలి సుధీర్. తాజాగా ‘ కాలింగ్ సహస్ర ‘ అనే సినిమాలో నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకక్కిన ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ విడుదల చేశారు చిత్ర యూనిట్.

ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సుధీర్ సమాధానం ఇచ్చారు. మీరు రష్మీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని రిపోర్టర్ అడగగా దానికి బదులుగా సుధీర్ నేను అసలు పెళ్లే చేసుకోను. ఇప్పుడు కెరియర్ ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఒకవేళ భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకుంటాను లేదంటే లేదు, ప్రేక్షకులను అలరించడానికి రష్మి తో అలా చేశాను కానీ బయట అదేమీ లేదు అని చెప్పుకొచ్చారు. అలాగే రష్మీ హీరోయిన్ గా మీరు ఎప్పుడు సినిమా చేస్తున్నారు అని అడగగా నేను రష్మీ కథలు వింటున్నాం, మా ఇద్దరికీ కామన్ గా నచ్చిన కథ ఇప్పటివరకు దొరకలేదు. ఒకవేళ అలాంటిది దొరికితే మీ ఇద్దరం కలిసి కచ్చితంగా నటిస్తాం, ఆ ప్రపోజల్ అయితే ఉంది అని సుధీర్ అన్నారు.

ఇక కాలింగ్ సహస్ర సినిమా గురించి చెబుతూ ఈ రోజుల్లో ఒక సినిమా హిట్ అయితే దానికి కారణం స్టోరీ. ఈ సినిమాకు కూడా అదే బలం. సుధీర్ ను దృష్టిలో పెట్టుకొని కాకుండా ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలని వెళితే ఈ సినిమాను కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇది నా మూడో సినిమా. నా సినిమాతో నిర్మాతలకు లాభాలు వస్తే చాలు. అలాగే వచ్చిన జనాలు కూడా సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడితే ఆనందిస్తా, దర్శకుడు ఏది చెబితే అది చేస్తా సలహాలు సూచనలు ఏమీ ఇవ్వను అని సుధీర్ అన్నారు

YouTube video

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది