Sukumar : చిరంజీవి, బాలయ్యల గురించి సుకుమార్ ఇంట్లో గొడవ.. తర్వాత ఏమైందంటే?
Sukumar : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. లెక్కల మాస్టారు అనుకున్నట్లుగానే దేశవ్యాప్తంగా సినిమా వసూళ్ల లెక్క తప్పలేదు. సక్సెస్ ఫుల్‌గా ఫిల్మ్ రన్ అవుతోంది. ప్రజెంట్ ‘పుష్ప’ పిక్చర్ సక్సెస్‌ను సుకుమార్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. తాజాగా బాలయ్య ‘ఆహా’ఓటీటీలో ‘అన్ స్టాపెబుల్ విత్ ఎన్‌బీకే’ షోకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు తెలిపాడు సుకుమార్.‘అన్ స్టాపెబుల్ విత్ ఎన్ బీకే’ షోలో రష్మిక మందన, సుకుమార్, బన్నీ సందడి చేశారు. బాలయ్య క్వశ్చన్స్‌కు ఆన్సర్స్ ఇస్తూ షోను ఎంజాయ్ చేశారు.
ఈ క్రమంలోనే సుకుమార్‌తో తాను మూడు నెలల్లో సినిమా కంప్లీట్ చేసేలా చేస్తానని బాలయ్య చెప్పుకొచ్చాడు. సుకుమార్ యాక్టర్స్‌తో పని చేసే స్టైల్ చూస్తుంటే తనకు కళా తపస్వి కె.విశ్వనాథ్ గుర్తొస్తారని తెలిపాడు బాలయ్య. ఈ క్రమంలోనే సుకుమార్ నుంచి ‘ఆరేసుకోబోయి.. పారేసుకున్నాను, ఆకుచాటు పిందే తడిసే’ వంటి చిత్రాలు ఎక్స్ పెక్ట్ చేయొచ్చా అని బాలయ్య సుకుమార్‌ను అడిగాడు. అందుకు బాలయ్య అవకాశమిస్తే తప్పకుండా అని సుకుమార్ ఆన్సర్ ఇచ్చాడు.ఈ క్రమంలోనే తనకు ఉన్న కన్ఫ్యూషన్‌కు బాలయ్యకు ఉన్న క్లారిటీకి సినిమా మూడు నెలల్ల పూర్తవుతుందని అభిప్రాయపడ్డారు.

Sukumar quarrels at home about Chiranjeevi and Balayya
Sukumar : మూడు నెలలలో సుకుమార్-బాలయ్య కాంబో సినిమా కంప్లీట్..!
ఇంతలోనే బాలయ్య జోక్యం చేసుకుని దసరాకు కొబ్బరికాయ కొట్టి, క్రిస్మస్‌కు గుమ్మడి కాయ కొట్టి, సంక్రాంతికి మూవీ రిలీజ్ చేసేద్దాం అని బాలయ్య అన్నారు. ఈ క్రమంలోనే సుకుమార్ తన చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. తమ ఊరిలో బాలయ్య, చిరంజీవి అని రెండు వర్గాలు ఉన్నాయని, తమ ఇంట్లోనూ అలా రెండు వర్గాలున్నాయని చెప్పాడు. తాము నలుగురు అన్నదమ్ములం కాగా, పెద్దన్నయ్య బాలయ్య డై హార్డ్ ఫ్యాన్ అని, మిగతవారు చిరంజీవి అభిమానులన తెలిపాడు. చిరు, బాలయ్య సినిమాలు విడుదల అయితే తమ ఇంట్లో పెద్ద గొడవ జరిగేదని, తమ ఇంట్లో ఓ వైపు చిరు, మరో వైపు బాలయ్య ఫొటోలు ఉన్నాయని వివరించాడు. సుకుమార్ అడగగానే బాలయ్య సుకుమార్ అన్నయ్యకు ఐ లవ్ యూ చెప్పాడు.