Tamannaah : ఎరుపెక్కిన అందం.. ఘాటు మిర్చిలా మ‌తులు పోగొడుతున్న త‌మ‌న్నా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tamannaah : ఎరుపెక్కిన అందం.. ఘాటు మిర్చిలా మ‌తులు పోగొడుతున్న త‌మ‌న్నా

 Authored By sandeep | The Telugu News | Updated on :12 May 2022,4:30 pm

Tamannaah : మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా అంద‌చందాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ద‌శాబ్ధ‌కాలంగా త‌న అంద‌చందాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తూ వ‌స్తుంది త‌మ‌న్నా.తాజాగా ఈ అమ్మ‌డు ఎఫ్ 3లో న‌టించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు చిత్రం ‘ఎఫ్ 3’ థియేట్రికల్ ట్రైలర్ రీసెంట్‌గా విడుద‌ల కాగా, ఈ ట్రైలర్ లో ప్రధాన నటీనటుల హాస్యాస్పదమైన డైలాగ్‌లు మరియు చర్యలతో సరదాగా మారింది. ఈ చిత్రంలో, వెంకటేష్‌కి రాత్రి దృష్టి సమస్యలు మరియు వరుణ్ తేజ్ సతమతమవుతున్నారు; కామెడీ స్థాయిని పెంచడానికి వారు ప్రత్యేకంగా రూపొందించిన బాడీ లాంగ్వేజ్‌ని కూడా కలిగి ఉన్నారు.

అనిల్ రావిపూడి కామెడీ డ్రామాలో వెంకటేష్ దగ్గుబాటి, వరుణ్ తేజ్, తమన్నా భాటియా, మెహ్రీన్, రాజేంద్ర ప్రసాద్, సోనాల్ చౌహాన్ మరియు ఇతరులు ఉన్నారు. మే 27న ‘ఎఫ్‌3’ ప్రేక్షకుల ముందుకు రానుంది.గ‌త కొద్ది రోజులుగా ఈ మూవీ జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. అయితే ప్ర‌మోష‌న్స్ లో త‌మ‌న్నా గ్లామ‌ర్ కుర్ర‌కారుకి పిచ్చెక్కిస్తుంది. అమ్మ‌డి అంద‌చందాలు మ‌తులు పోగొడుతున్నాయి. తాజాగా రెడ్ డ్రెస్‌లో క్యూట్‌క్యూట్‌గా క‌నిపిస్తూ కేక పెట్టించింది. త‌మ‌న్నా మెస్మ‌రైజింగ్ లుక్స్‌కి కుర్ర‌కారు పిచ్చెక్కిపోతున్నారు.

Tamannaah beauty looks

Tamannaah beauty looks

Tamannaah : మిల్కీనెస్ అదిరిపోయింది…

త‌మ‌న్నా తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది. సినిమాకు అవసరమైన మేరకు తమన్నా అందంతో మెప్పిస్తూనే వచ్చింది. రచ్చ లాంటి చిత్రాల్లో తమన్నా తన గ్లామర్ తో కుర్రాళ్ల కలల రాణిలా మారిపోయింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తుంది. మ‌రో వైపు ఐటెం సాంగ్స్ కూడా చేస్తుంది. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌నే పాల‌సీని తూచా త‌ప్ప‌క పాటిస్తుంది త‌మ‌న్నా.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది