F3 Movie : అందుకే ప్రమోషన్స్‌కు తమన్నా దూరంగా ఉందా..?
F3 Movie : మరికొన్ని గంటలలో ఎఫ్ 2 ఫ్రాంఛైజీలో వస్తున్న ఎఫ్ 3 సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్‌గా
నటించగా, సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు. పూజా హెగ్డే సోషల్ సాంగ్‌లో అలరించబోతోంది. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు.
అయితే, మే 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌కు తమన్నా దూరంగా ఉంది. ఏ ఇంటర్వ్యూలో కూడా దర్శకుడు అనిల్ రావిపూడు, హీరో మెహ్రీన్, సోనాల్ చౌహాన్, వెంకటేశ్, వరుణ్ తేజ్ కనిపిస్తున్నారు. ఒక్క తమన్నా మాత్రం ఎందుకు రాలేదు..మేకర్స్‌తో ఏదైనా విబేధాలు వచ్చాయా అని
నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా తమన్నా ఏ సినిమా చేసినా కూడా ప్రమోషన్స్ కి తప్పకుండా పాల్గొంటుంది. కానీ, ఎఫ్ 3 కి మాత్రం దూరంగా ఉందంటే సందేహాలు కలగడం కామన్.

Tamannaah Distance with Promotions F3 Movie
F3 Movie : తమన్నా తిరిగి ఇండియాకి చేరుకున్నట్టు సమాచారం.
కానీ, తమన్నా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొంటోంది. దీని కోసం ఆమెకు భారీగా రెమ్యునరేషన్ ఇచ్చారట. అందుకే, ఎఫ్ 3 ప్రమోషన్స్‌లో హాజరవలేకపోయినట్టు తెలుస్తోంది. ఇక కేన్స్ ఫెస్టివల్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో తమన్నా తిరిగి ఇండియాకి చేరుకున్నట్టు సమాచారం. ఇకపై సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో సక్సెస్ మీట్స్‌లో పాల్గొంటుందని మేకర్స్ నుంచి అందుతున్న సమాచారం. ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఎఫ్ 3 ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.