Nayanthara : ” ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది .. ఎవరి పిల్లలు వీళ్ళు ” నయనతార మీద తమిళనాడు హెల్త్ మినిస్టర్ ఎంక్వైరీ !
Nayanthara : దక్షిణాది హీరోయిన్ నయనతార.. విఘ్నేష్ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులయిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు 2022 జూన్ 9న కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహం జరిగిన నాలుగు నెలలకే తమకు కవలలు జన్మించినట్లుగా అనౌన్స్ చేశారు. దీంతో అభిమానులు షాకయ్యారు. అయితే వీరిద్దరు సర్రోగసి పద్దతి ద్వారా పిల్లలకు జన్మనిచ్చిట్లుగా తెలుస్తోంది. అంటే అద్దె గర్భం ద్వారా నయన్ పిల్లలకు జన్మనిచ్చింది. సరోగసి పద్దతి ద్వారా పేరెంట్స్ కావడంపై వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. సెలబ్రెటీలు మాత్రం ఈ జంటను విష్ చేస్తున్నారు.
సర్రోగసి పద్దతి ద్వారా పేరెంట్స్ అయిన నయన్ జంటగా తమిళనాడు ప్రభుత్వం షాకిచ్చింది. పెళ్లైన నాలుగు నెలలకే ఎలా పిల్లలు పుట్టారో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. భారతదేశంలో సర్రోగసి పద్దతి చట్టరీత్యా నేరం. గర్భం దాల్చలేని సందర్భంలో మాత్రమే ఈ పద్దతిని ఆవలంభించవచ్చు. అంతేకానీ సాధారణ మహిళలు ఈ పద్దతిలో పిల్లలు కనడం నేరం. ఈ చట్టం జనవరి 2022 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం పిల్లలు ఎలా పుట్టారో వివరాలు సమర్పించాలంటూ నయన్, విఘ్నేష్ జంటకు నోటీసులు పంపినట్లుగా తెలుస్తోంది. మరీ ఈ విషయంపై నయన్ దంపతులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Nayanthara : సరోగసీ అంటే ఏంటో తెలుసా…
మహిళ తన అండాన్ని దాచుకోవచ్చు… కోరుకున్నప్పుడే తల్లి కావచ్చు.. తమ అందాన్ని కాపాడుకోవడానికి, కెరియర్ ఎదుగుదలకు అడ్డు కాకూడదని కోరుకునే సెలబ్రిటీలు, ప్రెగ్నెన్సీ రిస్క్‌ను కలిగివున్నవారు, దీర్ఘకాలికమైన వ్యాధికి గురై కోలుకునే వారు, ప్రీ-మెచ్యుర్ మెనోపాజ్ సమస్య ఎదురైనవారు, కుటుంబ, వ్యక్తిగత కారణాలతో లేటుగా పిల్లలను కనాలని భావించేవారు, ఈ సర్రోగసీ ప్రక్రియను ఎంచుకుంటున్నారు. ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ ద్వారా ఈ పద్దతిని ఉపయోగిస్తారు. సింగిల్ గా ఉన్న పురుషులు కూడా అండాన్ని దాతనుంచి స్వీకరించి ఐవీఎఫ్ ద్వారా తమ శుక్ర కణాలతో సంయోగపర్చి పిండాన్ని సర్రోగసీ తల్లి గర్భంలో ప్రవేశపెట్టి తండ్రిగా మారుతున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహర్ ఇదే పద్దతిలో తండ్రిగా మారాడు.