Tejaswi Madivada : పచ్చని ప్రకృతి మాటున అందాల ఆరబోతకు దిగిన తేజస్వి
Tejaswi Madivada : తేజస్వి… ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ప్రేక్షకులని మెప్పించిన ఈ అమ్మడు ఆ తర్వాత ఆర్జీవీ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో అందాలు ఆరబోసి ఒక రేంజ్ లో హైలైట్ అయ్యింది ఈ బ్యూటీ. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. బిగ్ బాస్ లో తనదైన ఆట తీరుతో ఆకట్టుకుంది. రీసెంట్ గా బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా పాటిస్పేట్ చేసింది తేజస్వి. ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రోజూ అదిరిపోయే అందాలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.
Tejaswi Madivada : తేజస్వి స్టన్నింగ్ కామెంట్స్..
ఈ చిన్నది కమిట్మెంట్ అనే సినిమాలో నటించగా, ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తేజస్వి అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇక తాజాగా పచ్చని ప్రకృతిలో దిగిన స్టన్నింగ్ పిక్ ఒకటి షేర్ చేసింది. ఇందులో తేజస్వి అందచందాలు కుర్రకారు మతులు పోగొడుతున్నాయి. కేక పెట్టించే అందాల ముద్దుగుమ్మని చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. ప్రస్తుతం తేజస్వి స్టన్నింగ్ లుక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ అమ్మడు శ్రీరెడ్డిని టార్గెట్ చేయడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది.
చేయాల్సిన తప్పు చేసి, అంతా అయిపోయాక ఇప్పుడు నేను మోసపోయాను, నన్ను వాడుకున్నారని చెప్పడం కరెక్ట్ కాదని వెల్లడించింది తేజస్వి. మన అంగీకారం లేకపోతే ఏమీ జరగదని, కానీ ఆ టైమ్‌లో ఒప్పుకుని, ఇప్పుడు ఆ విషయాలను బయటపెట్టడం సరికాదని తెలిపింది. తాను నటించిన `కమిట్‌మెంట్` చిత్రంలో అవకాశాల కోసం ఆఫీసుల వెంట తిరిగే అమ్మాయిగా నటిస్తుంది. ఇది శ్రీరెడ్డి రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉండటంతో, దీనిపై స్పందించింది. తన వ్యక్తిగత అనుభవాలకు సంబంధించి ఓపెన్ అయ్యింది తేజస్వి. తాను కమిట్‌మెంట్ పరిస్థితులను ఎదుర్కొన్నట్టు చెప్పింది. సక్సెస్ అనేది పక్కన పెడితే తనకు చాలా బలుపు ఉంటుందని పేర్కొంది. తనని చాలా మంది కమిట్‌మెంట్ అడిగారని, ఇప్పుడు అడగడానికి భయపడతారని, వాళ్ల పేర్లు ఎక్కడ బయటపెడతానో అన్న భయం వాళ్లల్లో ఉందని చెప్పింది.