Nagarjuna : నాగార్జున గారు.. మళ్లీ మళ్లీ మమ్ములను ఎదవలను చేయవద్దు ప్లీజ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nagarjuna : నాగార్జున గారు.. మళ్లీ మళ్లీ మమ్ములను ఎదవలను చేయవద్దు ప్లీజ్

 Authored By aruna | The Telugu News | Updated on :15 September 2022,7:30 pm

Nagarjuna : తెలుగు బిగ్ బాస్ ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా నాగార్జునకు వార్నింగ్ తో కూడిన విజ్ఞప్తిని చేస్తున్నారు. గత వారం ఎలిమినేషన్ కి నామినేషన్ అయ్యారు అంటూ కొందరిని ఓటింగ్ లో ఉంచి ప్రేక్షకులతో ఓట్లు వేయించారు. తీరా వీకెండ్‌ వచ్చేప్పటికీ ఎవ్వరూ కూడా ఎలిమినేట్ అవ్వడం లేదు అంటూ ఉసూరుమనిపించాడు. అలాంటప్పుడు ఓటింగ్ ఎందుకు పెట్టాలి అంటూ ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారం ప్రేక్షకులు ఓటింగ్ వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ముందు ముందు ఇలాంటి వ్యవహారాలు మళ్లీ జరిగితే అసలు ఓట్లు వేయవద్దు అంటూ పిలుపునిస్తామంటూ బిగ్బాస్ ప్రేక్షకులు హెచ్చరిస్తున్నారు.

మాతో ఓట్లు వేయించి మమ్ములను ఎదవలను చేసి నవ్వించారు.. మమ్ములను రెచ్చగొట్టారు అంటూ నాగార్జున పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోసారి ఈ వారం ఎలిమినేషన్ లేదు అంటూ నాగార్జున ప్రకటించి అనూహ్యంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం కార్యక్రమాన్ని బహిష్కరిస్తామంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నారు. మళ్లీ మళ్లీ మమ్ములను ఎదవలను చేయకండి ప్లీజ్ నాగార్జున గారు అంటూ బ్రహ్మానందం స్టైల్ లో కొందరు సోషల్ మీడియా ద్వారా బిగ్ బాస్ టీం కి విజ్ఞప్తి చేస్తున్నారు.

telugu bigg boss fans and audience trolls on nagarjuna about first week elimination

telugu bigg boss fans and audience trolls on nagarjuna about first week elimination

వీకెండ్‌ ఎపిసోడ్‌ అంటే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తాం.. ఎన్నో ఆశలు పెట్టుకొని ఓట్లు వేస్తాం. అలాంటిది ఎలిమినేషన్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఎవ్వరు ఎలిమినేట్ కావడం లేదు అంటే మా సమయం అంతా వృధా అయినట్లే కదా అంటూ కొందరు బిగ్ బాస్ టీం ని ప్రశ్నిస్తున్నారు. అసలు గత వారం ఎందుకు ఎలిమినేషన్ చేయలేదు మాకు చెప్పాలి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎలిమినేషన్ చేయకూడదు అని ముందుగానే భావించి ఉంటే ఓటింగ్ కి లైన్లో ఓపెన్ చేయకుండా ఉండాలసింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి గత వారం ఎలిమినేషన్ లేకపోవడంతో కొందరు తీవ్రంగా హర్ట్ అయినట్లుగా అనిపిస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది