Telugu Movies : ఒకే ట్రెండ్ ని ఫాలో అవుతోన్న తెలుగు సినిమా .. రాజుగారి కథలు !
Telugu Movies : తెలుగు చలనచిత్ర రంగంలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ సాగుతుంటది. ఒకప్పుడు వరుస పెట్టి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు హవా నడిచాయి. ఆ తర్వాత పూర్తిగా మాస్ సినిమాల టైం నడిచింది. కాదా ఇప్పుడు పూర్తిగా చూస్తే పిరియాడికల్ జోనర్ సినిమాలే తెరకెక్కుతున్నాయి. సుకుమార్ తీసిన “రంగస్థలం” నుంచి రీసెంట్ గా విడుదలైన “దసరా”, “విరూపాక్ష” సినిమాల వరకు… అన్నీ కూడా పీరియాడికల్ జోనర్ సినిమాలే. ఈ తరహాలో రామ్ చరణ్ రంగస్థలం, కళ్యాణ్ రామ్ బింబిసారా, సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష, నాని దసరా…
లతో పీరియాడికల్ కథలతో తిరుగులేని విజయాలు అందుకోవటం జరిగింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా 17వ శతాబ్దం కాలంనాటి ఒక స్టోరీ తో హరిహర వీరమల్లు అనే పీరియాడికల్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నాగార్జున వందవ సినిమా కూడా పీరియాడికల్ జోనర్ నీ దృష్టిలో పెట్టుకుని స్టోరీ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా తెలుగు మేకర్స్ చాలా వరకు ఇప్పుడు…పీరియాడికల్ ట్రెండ్ నీ ఫాలో అవుతూ ఉన్నారు.
తెలుగు సినిమాలు మాత్రమే కాదు దక్షిణాదిలో కన్నడ ఇండస్ట్రీలో కాంతారా, తమిళ ఇండస్ట్రీలో పొన్నియిన్ సెల్వాన్ సినిమాలు కూడా పీరియాడికల్ కథలతో తెరకెక్కటం జరిగింది. ఒకప్పుడు మనవడికి తాతయ్య అమ్మమ్మలు కథ చెప్పాలంటే అనగనగా ఒక రాజు ఉండేవాడు అని చెప్పినట్టుగా… ఇప్పుడు సినిమాలు కూడా ఒకప్పటి కథ చెబుతూ ప్రేక్షకులను ఆ కథలోకి.. తీసుకెళ్తూ… వాళ్ల మనసులను గెలిచే రీతిలో విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్..లతో ఆకట్టుకుంటూ ఉన్నారు.