Thaman – Trivikram : తమన్ – త్రివిక్రమ్ ఇద్దరి మధ్యా ఎక్కడ చెడింది – మహేష్ బాబు ముందరే గొడవపడ్డారా ?
Thaman – Trivikram : మాటల మాంత్రికుడు త్రివిక్రం సూపర్ స్టార్ మహేష్ ఇద్దరు కలిసి తమ హ్యాట్రిక్ మూవీ చేస్తున్నారు. ఎస్.ఎస్.ఎం.బి 28 ఎన్నో భారీ అంచనాలతో వస్తుంది. ఈ మూవీ కి ముందు మ్యూజిక్ డైరక్టర్ గా థమన్ ని ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడు అతని ప్లేస్ లో కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ని తీసుకుంటున్నారట. ఇంతకీ అసలు మ్యాటర్ ఎక్కడ చెడింది అంటే థమన్ తను కోరిక అవుట్ పుట్ ఇవ్వడంలో విఫలమవడమే అంటున్నారు. థమన్ తో త్రివిక్రం అంతకుముందు అరవింద సమేత, అల వైకుంఠపురములో మూవీస్ చేశారు.
ఆ రెండు సినిమాలకు వీరి సింక్ కుదరగా మహేష్ సినిమాకు మాత్రం ఎందుకో థమన్ ఏ బాణీ ఇచ్చినా త్రివిక్రం కి నచ్చట్లేదట. త్రివిక్రం అందుకే థమన్ ప్లేస్ లో అనిరుద్ ని తీసుకోవాలని అనుకుంటున్నాడట. ఈ నిర్ణయం నిజంగా థమన్ కి షాక్ ఇస్తుందని చెప్పొచ్చు. థమన్ ఓ పక్క వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. శంకర్ డైరక్షన్ లో చరణ్ చేస్తున్న సినిమాకు థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. అదేకాకుండా మరో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. కాబట్టి థమన్ కూడా మహేష్ సినిమాని లైట్ తీసుకున్నాడని అంటున్నారు.
మహేష్ తో మొదటిసారి అనిరుద్. యువ సంగీత కెరటం అనిరుద్ సూపర్ స్టార్ మహేష్ కి మొదటిసారి మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇప్పటికే అజ్ఞాతవాసి కోసం పవర్ స్టార్ సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన అనిరుద్ ఎన్.టి.ఆర్ 30వ సినిమాకు ఆయన సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పుడు మహేష్ 28కి కూడా అనిరుద్ అదరగొట్టాలని చూస్తున్నాడు. మరి ఈ మూవీకి అనిరుద్ మ్యూజిక్ ఏవిధంగా హెల్ప్ అవుతుంది అన్నది చూడాలి. మహేష్ కోరిక మేరకు త్రివిక్రం సినిమా కథ మొత్తం మార్చేశాడట. మహేష్ ఫ్యామిలీ లో వరుసగా అనుకోని సంఘటనలు జరగడంతో త్రివిక్రం సినిమా తర్వాత షెడ్యూల్ కి కొంత టైం తీసుకుంటున్నారని తెలుస్తుంది.