Samantha : ఈ టైమ్ లో సమంతను ఆ విషయంలో చాలా ఇబ్బంది పెడుతున్న డైరెక్టర్
Samantha : సమంత గత కొన్ని నెలలుగా మయో సైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆమె చావు బతుకుల నుండి ఈమధ్య బయట పడింది అంటూ ఆమె సన్నిహితులు మాట్లాడుతున్నారు. ఒకానొక సమయంలో ఆమె కనీసం నోటి నుండి మాట రాలేదట, కనీసం తినడానికి కూడా ఆమెకు ఓపిక ఉండేది కాదట. అలాంటి పరిస్థితి నుండి మెల్ల మెల్లగా సమంత బయట పడింది. ఆ మధ్య ముంబై ఎయిర్పోర్టులో కనిపించిన సమంత ఆ తర్వాత శాకుంతలం సినిమా యొక్క ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో కూడా సందడి చేసిన విషయం తెలిసిందే. ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో సమంత కనిపించింది కానీ ఆమె ఆ సమయంలో చాలా అస్వస్థతతో ఉన్నట్లుగా అర్థమైంది.
ఆమె ఆరోగ్యం పూర్తిగా బాగుపడలేదని అప్పుడే క్లారిటీ వచ్చింది. శాకుంతలం సినిమా ను ఫిబ్రవరి 17వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు దర్శక నిర్మాత గుణశేఖర్ సిద్ధం అయ్యాడు. భారీ ఎత్తున సినిమా ను విడుదల చేసేందుకు గాను పబ్లిసిటీ విషయంలో కూడా అదే రేంజ్ పాటించాలని భావిస్తున్నాడట. తెలుగులో మాత్రమే కాకుండా ఉత్తరాదిన మరియు సౌత్ లో అన్ని భాషల్లో కూడా సినిమాను విడుదల చేయబోతున్నాడు. కనుక అన్ని చోట్ల సమంతతో పబ్లిసిటీ చేయించాలని దర్శకుడు గుణశేఖర్ ప్రయత్నాలు చేస్తున్నాడట.
ఇప్పటికే ఆమె ఆరోగ్యం బాగాలేదు.. ఈ సమయంలో ప్రమోషన్ కోసం అంటూ ఆమెను తిప్పడం కరెక్ట్ కాదని కొందరు వైద్యులు సూచిస్తున్నారట. కానీ దర్శకుడు గుణశేఖర్ మాత్రం సమంతను ప్రమోషన్ విషయంలో ఇబ్బంది పెడుతున్నాడట. కనీసం 8 నుండి 10 రోజులైనా శాకుంతలం సినిమా కోసం కేటాయించాల్సిందే అంటూ ఆయన డిమాండ్ చేస్తున్నాడట. సినిమా కోసం సమంత అగ్రిమెంట్ చేసిన సమయంలోనే ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరవుతానంటూ సైన్ చేసింది. కనుక ఆమె ఇప్పుడు అనారోగ్యంతోనే ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరవ్వాల్సి ఉంది. పాపం ఈ సమయంలో సమంతను దర్శకుడు గుణశేఖర్ ఇబ్బంది పెట్టడం భావ్యం కాదంటూ ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.