Jabardasth : జబర్దస్త్ కార్యక్రమానికి అక్కడ కూడా దారుణమైన ఫలితం.. దుకాణం మూసేయాల్సిందేనా?
Jabardasth : ఈటీవీలో దశాబ్ద కాలంగా ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం రేటింగ్ ఈ మధ్య కాలంలో మరి దారుణంగా పడిపోయింది. గతంలో ఎప్పుడు లేని విధంగా జబర్దస్త్ యొక్క రేటింగు పడి పోవడంతో మల్లెమాల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఈటీవీలో చూడకున్నా యూట్యూబ్ లో జబర్దస్త్ స్కిట్స్ చూసేవారు. కానీ ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో కూడా వ్యూస్ చాలా తగ్గాయి. గతంలో చమ్మక్ చంద్ర, హైపర్ ఆది, సుడిగాలి సుదీర్ […]
Jabardasth : ఈటీవీలో దశాబ్ద కాలంగా ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం రేటింగ్ ఈ మధ్య కాలంలో మరి దారుణంగా పడిపోయింది. గతంలో ఎప్పుడు లేని విధంగా జబర్దస్త్ యొక్క రేటింగు పడి పోవడంతో మల్లెమాల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఈటీవీలో చూడకున్నా యూట్యూబ్ లో జబర్దస్త్ స్కిట్స్ చూసేవారు. కానీ ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో కూడా వ్యూస్ చాలా తగ్గాయి. గతంలో చమ్మక్ చంద్ర, హైపర్ ఆది, సుడిగాలి సుదీర్ ఉన్న సమయంలో వచ్చిన వ్యూస్ తో పోలిస్తే ఇప్పుడు కనీసం 10వ వంతు కూడా వ్యూస్ కూడా రాకపోవడంతో మల్లెమాల వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అతి త్వరలోనే జబర్దస్త్ కార్యక్రమాన్ని
ఆపేసే అవకాశాలు ఉన్నాయి అంటూ బుల్లితెర వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఖర్చు తగ్గించుకునేందుకు హైపర్ ఆది వంటి స్టార్ కమెడియన్ ను తొలగించిన మల్లెమాల వారు ఇప్పుడు రేటింగ్ పెంచుకునేందుకు మరియు యూట్యూబ్ లో స్కిట్స్ యొక్క వ్యూస్ పెంచుకునేందుకు ఏం చేయాలో ఆలోచిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి మల్లెమాల వారు నిర్వహిస్తున్న జబర్దస్త్ కార్యక్రమం యొక్క రేటింగ్ మరీ తగ్గుతున్న ఈ సమయంలో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో అర్థం కావడం లేదని జబర్దస్త్ కమెడియన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎంత గొప్పగా కామెడీ చేసినా కూడా ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు చూడడం లేదని జబర్దస్త్ కమెడియన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ కార్యక్రమం యొక్క రేటింగ్ దారుణంగా పడి పోయిన నేపథ్యంలో ముందు ముందు ఇతర చానల్స్ లో కూడా ఇలాంటి కామెడీ కార్యక్రమాలను తీసుకొచ్చేందుకు భయపడుతున్నారు. గతంలో మాదిరిగా ప్రేక్షకులు కామెడీని ఆస్వాదించడం లేదు. అందుకే జబర్దస్త్ కార్యక్రమాన్ని మెల్ల మెల్లగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. రెండు ఎపిసోడ్స్ గా వారం వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న జబర్దస్త్ కార్యక్రమం ముందు ముందు ఒకే ఎపిసోడ్ గా టెలికాస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.