Ticket Price : సంక్రాంతి సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతారా లేదా.. సస్పెన్స్ వీడేది ఎప్పుడు..?
ప్రధానాంశాలు:
Ticket Price : సంక్రాంతి సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతారా లేదా.. సస్పెన్స్ వీడేది ఎప్పుడు..?
Ticket Price : న్యూ ఇయర్ వచ్చేసింది నెక్స్ట్ సంక్రాంతి సినిమాల హడావిడి మొదలవుతుంది. ఐతే కొత్త ఏడాది అది కూడా పండగ టైం కాబట్టి స్టార్ సినిమాల రిలీజ్ హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది. ఐతే అందుకు తగినట్టుగానే సినిమాల టికెట్ రేట్లు పెంచడం, బెనిఫిట్ షో పర్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఐతే తెలంగాణాలో టికెట్ రేట్ల హైక్ ఇంకా బెనిఫిట్ షోస్ గురించి సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పుష్ప 2 సినిమా టైంలో జరిగిన ఘటన వల్ల రేవంత్ ఆ నిర్ణయానికి వచ్చారు. ఐతే ఎఫ్.డి.సి చైర్మన్ అయిన దిల్ రాజు దీన్ని సెట్ చేసే పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇదిలాఉంటే ఈ సంక్రాంతి సినిమాలకు తెలంగాణాలో టికెట్ రేట్లు పెంచుతారా లేదా అన్నది పెద్ద ట్విస్ట్ గా మారింది.
Ticket Price భారీ బడ్జెట్ సినిమా కాగా..
ఈ సస్పెన్స్ వీడాలంటే సినిమాలు వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఐతే ఆలోగా దిల్ రాజు టికెట్ రేట్ల విషయాన్ని సెట్ చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతికి దిల్ రాజు నిర్మించిన రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ భారీ బడ్జెట్ సినిమా కాగా.. మరోటి వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం వస్తుంది. ఐతే ఈ రెండు సినిమాలతో పాటు బాలకృష్ణ డాకు మహారాజ్ కూడా వస్తుంది. ఐతే సంక్రాంతి సినిమాల టికెట్ రేట్ల పెంచకపోవడమే బెటర్ అని ఫ్యాన్స్ అంటున్నారు. టికెట్ రేట్లు పెంచి కామన్ ఆడియన్ కి సినిమా అందని ద్రాక్షగా చేస్తున్నారు.
ఐతే దిల్ రాజు తన బలమంతా ఉపయోగించి టికెట్ రేట్లు పెంచేందుకు కృషి చేస్తున్నారు. పుష్ప 2 అలా పెంచిన టికెట్ రేట్ల వల్లే భారీ వసూళ్లను రాబట్టింది. మరి గేమ్ ఛేంజర్ కూడా అదే తరహాలో రికార్డ్ కలెక్షన్స్ తెస్తుందా లేదా అన్నది చూడాలి. టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలపై క్లారిటీ రావాలంటే మాత్రం మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే అని తెలుస్తుంది. Telangana, Ticket Price, Game Changer, Ram Charan, Dil Raju, Revanth Reddy